Go to full page →

ఏకమైన మూడు హింసాత్మక శక్తులు ChSTel 187

చావులేని ఆత్మ, ఆదివార పవిత్రత అన్న రెండు గొప్ప దోషాల ద్వారా సాతాను తన మోసాలతో ప్రజల్ని వశపర్చుకుంటాడు. మొదటిది ప్రేత మతానికి పునాది వేయగా, రెండోది రోము పట్ల సానుభూతి బంధం సృష్టిస్తుంది. అమెరికా దేశంలోని ప్రొటస్టాంటులు ప్రేతమతాన్ని స్వీకరించటానికి అగాధం మీదుగా చేతులు చా పే వారిలో ప్రథములవుతారు. రోము అధికారంతో చేతులు కలపటానికి వారు అగాధం మీదుగా వంగుతారు. ఈ మూడు శక్తుల సమాఖ్య ప్రభావం కింద ఈ దేశం (అమెరికా) మనస్సాక్షి హక్కుల్ని కాల రాయటానికి రోము అడుగు జాడల్లో నడుస్తుంది. ది గ్రేట్ కాంట్రవర్సి, పు. 588. ChSTel 187.1