దైవ ధర్మశాస్త్రానికి మారుగా మానవ చట్టాల్ని ప్రవేశపెట్టటం, కేవలం మానవ అధికారం కింద బైబిలు సబ్బాతు స్థానే ఆదివారాన్ని నిలపటం ఈ నాటకంలో చివరి అంకం. ఈ మార్పు ప్రపంచ వ్యాప్తమైనప్పుడు దేవుడు తనను తాను వెల్లడి చేసుకుంటాడు. ఆయన తన ఘనత మహాత్మ్యములతో లేచి భూమి కంపింపజేస్తాడు. ఈ లోక నివాసుల దుర్మార్గతకు వారిని శిక్షించటానికి ఆయన తన నివాసం నుంచి బయలుదేరివస్తాడు. భూమి అది తాగిన రక్తాన్ని బయలు పర్చుతుంది. అది తన మిద చంపబడ్డవారిని ఇక కప్పదు. టెస్టిమొనీస్, సం. 7, పు. 141. ChSTel 187.2
మన జాతి తన ప్రభుత్వ నియమాల్ని త్యజించి ఆదివారాచరణ చట్టాన్ని చేస్తే ఈ చర్యలో ప్రొటస్టాంటు క్రైస్తవం పోపుల మతంతో చెయ్యి కలుపుతుంది. ఇది, అవకాశం కోసం కని పెడ్తున్న నిరంకుశత్వం పైకి లేవటానికి క్రియాశీలమవ్వటానికి ప్రాణం పోసినట్లవుతుంది. టెస్టిమొనీస్, సం.5, పు. 712. ChSTel 187.3
దైవ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పోపు మత వ్యవస్థను అమలుపర్చటానికి డిక్రీ జారీ చేయ్యటం ద్వారా మన జాతి నీతిని పూర్తిగా విడిచి పెడుతుంది. రోము అధికారంతో జట్టు కట్టటానికి ప్రొటస్టాంటు క్రైస్తవ్యం అఖాతం మీదుగా చెయ్యి చాపినప్పుడు; ప్రేత మతలంతో చెయ్యి కలపటానికి అది పాతాళానికి వంగినప్పుడు; ఈ మూడు శక్తుల ప్రభావం కింద మన దేశం ప్రొటస్టాంటు గణతంత్ర ప్రభుత్వంగా తన రాజ్యాంగానికి సంబంధించిన ప్రతీ నియమానికి నీళ్లిదిలి, పోపుల అబద్దాలు మోసాల ప్రబోధానికి ఏర్పాట్లు చేసినప్పుడు, అప్పుడు సాతాను అద్భుత కార్యాలు చెయ్యటానికి సమయమయ్యిందని, అంతం సమీపంగా ఉందని మనం గ్రహించవచ్చు. టెస్టిమొనీస్, సం5, పు. 451. ChSTel 187.4
తొలినాళ్ల శిష్యుల్లా మనం నిర్జన, ఏకాంత ప్రదేశాలు ఆశ్రయం కోసం వెదక్కోవలసిన సమయం ఎక్కువ దూరంలో లేదు. రోమా సైనికులచే యెరూషలేము ముట్టడి యూదయ క్రైస్తవులు పారిపోటానికి సూచన అయినట్లే, మనదేశం (అమెరికా) పోపుల సబ్బాతును అమలు పర్చుతూ డిక్రీ జారీ చెయ్యటం మనకు ఓ హెచ్చరిక అవుతుంది. అప్పుడు పర్వతాల నడుమ ఏకాంత స్థలాల్లో చిన్న చిన్న విశ్రాంతి గృహాలికి వెళ్లి తలదాచుకోటానికి సిద్దపడటానికి పెద్ద పెద్ద నగరాల్ని విడిచి పెట్టే సమయం వస్తుంది. టెస్టిమొనీస్, సం5, పు. 164, 465. ChSTel 188.1