ప్రభువు మన ముందు వెళ్లి తెరిచిన సేవల్ని పోషించటానికి చాలినన్ని నిధులు ఎలా సమకూర్చగలం అన్న ఆందోళనకర సమస్య ఏళ్ల తరబడి మన ముందుంటున్నది. సువార్త ఇస్తున్న స్పష్టమైన ఆదేశాల్ని మనం చదువుతున్నాం. స్వదేశంలోను విదేశాల్లోను ఉన్న సేవలే వాటి అవసరాల్ని సమర్పిస్తున్నాయి. సూచనలు, ప్రభువు సానుకూల ప్రత్యక్షతలు కలిసి, వేచి ఉన్న సేవను శీఘ్రంగా ముగించమంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి. టెస్టిమొనీస్ సం.9, పు. 114, ChSTel 195.1
సఫల ప్రణాళిక ChSTel 195.2
అవిశ్వాసుల్ని చేరటానికి రూపొందిన కొత్త ప్రణాళికల్లో ఒకటి సేవల నిమిత్తం ఇన్ గేదరింగ్ ఉద్యమం. గత కొన్ని సంవత్సరాల్లో అనేక స్థలాల్లో ఇది విజయవంతమౌతున్నది. అనేకులికి ఎంతో ఉపకారం చేస్తున్నది. సేవా ఖజానాల్లోకి ఎక్కువ నిధుల్ని రాబట్టుతున్నది. అన్య దేశాల్లో మూడో దూత వర్తమాన ప్రగతిని గూర్చి అవిశ్వాసులు విన్నప్పుడు వారి సానుభూతి మేల్కోటంతో హృదయాల్ని జీవితాల్ని మార్చగల శక్తి ఉన్న సత్యం గురించి ఎక్కువ తెలుసుకోటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అన్ని తరగతుల పురుషులు స్త్రీలని చేరటం జరుగుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగుతున్నది. ఎమ్ఎస్. “కాన్సిక్రేటెడ్ ఎఫర్ట్స్ టు రీచ్ అన్ బిలీవర్స్,” జూన్ 5, 1914. ChSTel 195.3
అవిశ్వాసుల నుంచి కానుకలు తీసుకోటంలోని ఔచిత్యాన్ని కొందరు ప్రశ్నించవచ్చు. “మనలోకానికి నిజమైన హక్కుదారుడెవరు? దాని ఇళ్లు భూములు, దాని బంగారం వెండి ఎవరిది?” అని వారు తమని తాము ప్రశ్నించుకోవాలి. మన ప్రపంచంలో దేవునికి సమస్తం సమృద్ధిగా ఉంది. ఆయన తన వస్తువుల్ని విధేయులు అవిధేయులు అందరి చేతుల్లోనూ పెడుతున్నాడు. తన సేవ నిమిత్తం తమ సమృద్దిలో నుంచి ఇవ్వటానికి లౌకిక ప్రజల్ని విగ్రహారాధకుల్ని సయితం ఉత్సాహపర్చటానికి ప్రభువు సిద్దంగా ఉన్నాడు. తన ప్రజలు ఈ మనుషుల్ని జ్ఞాన వినేకాలతో కలిసి, తాము చేస్తున్న పనికి వారి గమనాన్ని తిప్పటం నేర్చుకున్న వెంటనే ప్రభువు ఈ కార్యం చేస్తాడు. ప్రభువు సేవావసరాల్ని ధనం పలుకుబడి ఉన్నవారి ముందు మనం సరి అయిన రీతిగా పెడితే, ఈ మనుషులు నేటి సత్య ప్రగతికి ఎంతో తోడ్పడవచ్చు. లోకం పై ఆధారపడ కూడదని నిశ్చయించుకోకుండా ఉండి ఉంటే, తాము ఉపయోగించుకుని మేలు పొందగలిగి ఉండే అనేక ఆధిక్యతల్ని తరుణాల్ని దైవ ప్రజలు పోగొట్టుకునేవారు కాదు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 195.4
ప్రభువు తన వస్తువుల్ని అవిశ్వాసులు చేతుల్లోను విశ్వాసుల చేతుల్లోను పెడుతున్నాడు. పతనమైన లోకానికి చేయాల్సి ఉన్న పనిని చెయ్యటానికి అందరూ ఆయనవి ఆయనకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నారు. మనం లోకంలో ఉన్నంత కాలం, దేవుని ఆత్మ మనుషులతో వాదించేంత కాలం ఉపకారాలు పొందటం వాటిని ఇతరులుకి ఇవ్వటం జరగాలి. లేఖనాల్లో ఉన్న ప్రకారం మనం లోకానికి వెలుగు అందించాలి. తన సేవకు ఇవ్వటానికి లోకాన్ని ఆయన నడిపించిన కొద్దీ వారి నుంచి మనం పొందాలి. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 196.1
ప్రస్తుతం దాదాపు పూర్తిగా దుష్టుల చేతుల్లో ఉన్నప్పటికీ, ప్రపంచం దాని సర్వభాగ్యం ఐశ్వర్యంతో దేవుని సొత్తు. “భూమియు దాని సంపూర్ణతయు... యెహోవావే.” “వెండి నాది, బంగారం నాది అని సైన్యాలకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు.” “అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.” క్రైస్తవులు సరియైన నియమాల్ని పాటిస్తూ, లోకంలో తన రాజ్య పురోగతికి దేవుడి చ్చే అవకాశాల్ని సద్వినియోగపర్చుకోటం తమ ఆధిక్యత, విధి అని గుర్తిస్తే ఎంత బాగుటుంది! సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904, ChSTel 196.2