ఇన్గేదరింగ్ ఉద్యమంలో ఉపయోగించటానికి కరపత్రం సిద్ధం చేసుకుని ప్రత్యేక మిషనెరీ పనిని చేపట్టటానికి సిద్దంగా ఉన్నవారికి నా సలహా ఇది: పరిశుద్దాత్మ మార్గదర్శకత్వంలో నివసించండి. ప్రతి దినం మా క్రైస్తవానుభవాన్ని వృద్ధి పర్చుకోండి. ప్రత్యేక అభిరుచి ఉన్నవారు అధికుల నడుమ, అల్పుల నడుమ అవిశ్వాసుల కోసం పని చెయ్యనివ్వండి. నశించిపోతున్న ఆత్మల కోసం శ్రద్దగా వెదకండి. తప్పిపోయిన వారిని తిరిగి తన మందలో చేర్చటానికి క్రీస్తుకున్న ఆకాంక్షను పరిగణించండి! లెక్క అప్పగించాల్సిన వారిగా ఆత్మల కోసం కని పెట్టండి. మీ సంఘంలో మీ ఇరుగు పొరుగు వారి మధ్య మి మిషనెరీ సేవలో స్వచ్చమైన, స్థిరమైన కిరణాలతో మివెలుగు ప్రకాశింప నివ్వండి. తీర్పు దినాన ఎవరూ “సత్యం గురించి మీరు నాకెందుకు చెప్పలేదు? నా ఆత్మను మీరు ఎందుకు లెక్క చెయ్యలేదు?” అనటానికి తావులేకుండా ప్రకాశింపనివ్వండి. అందుచేత మన విశ్వాసులు కానివారి నడుమ పంచటానికి జాగ్రత్తగా తయారు చేసిన సాహిత్యాన్ని నమ్మకంగా పంచుదాం. అవిశ్వాసుల గమనాన్ని ఆకర్షించటానికి ప్రతీ తరుణాన్ని సద్వినియోగపర్చుకుందాం. అంగీకరించే ప్రతీ వ్యక్తి చేతికి సాహిత్యాన్ని అందిద్దాం. “యెహోవాకు మార్గము సిద్దపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి” అన్న వర్తమాన ప్రకటనకు మనల్ని అంకితం చేసుకుందాం. ఎమ్ఎన్, “కాన్సిక్రేటెడ్ ఎఫర్ట్స్ టు రీచ్ అన్ బిలీవర్స్,” జూన్ 5, 1914. ChSTel 197.1