విదేశ మిషనరీ సేవల వృద్దిపట్ల మరింత ఉదారమైన, మరింత ఆత్మో పేక్షపూరిత, మరింత ఆత్మ త్యాగపూరిత స్వభావం ప్రదర్శితమైనప్పుడు, స్వదేశ మిషనేరీ సేవ అన్ని విధాలా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే స్వదేశ సేవాభివృద్ధి చాలామట్టుకు విదేశాల్లో జరిగే సువార్త సేవ ప్రతిబింబించే ప్రభావం పై ఆధారపడి ఉంటుంది. దేవుని సేవ అవసరాల సరఫరాలో చురుకుగా పని చెయ్యటంలో మనం మన ఆత్మల్ని సమస్త శక్తికి మూలమైన ప్రభువుతో అనుసంధాన పర్చుకుంటాం. టెస్టిమొనీస్, సం. 6, పు.27. ChSTel 198.3
మంచి క్రైస్తవుడైన ఓ అమెరికా దేశపు వ్యాపారస్తుడు తోటి పనివాడితో మాట్లాడుతూ తాను దినంలో ఇరవైనాలుగుగంటలూ క్రీస్తు సేవ చేస్తున్నానని చెప్పాడు. “నా వ్యాపార సంబంధాలన్నిటిలో నేను నా ప్రభువుకి ప్రతినిధిగా పని చెయ్యటానికి ప్రయత్నిస్తాను. అవకాశం కలిగినప్పుడు, ఇతరుల్ని క్రీస్తు విశ్వాసుల్ని చెయ్యటానికి ప్రయత్నిస్తాను. దినమంతా క్రీస్తు సేవ చేస్తున్నాను. రాత్రి నిద్రపోతున్న సమయంలో చైనాలో ఆయన సేవ చెయ్యటానికి నాకో మనిషి ఉన్నాడు,” అన్నాడు. దాన్ని అతడు ఇలా విశదం చేశాడు: “నా యౌవనంలో అన్యదేశాలికి మిషనెరీగా వెళ్లటానికి తీర్మానించుకున్నాను. కాని నా తండ్రి మరణించిన తర్వాత కుటుంబాన్ని పోషించటానికి నా తండ్రి వ్యాపారాన్ని చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నేనే మిషనెరీగా వెళ్లేబదులు ఓ మిషనైరీని పోషిపస్తున్నాను. చైనాలో పలానా ప్రాంతంలోని పలానా పట్టణంలో నా దైవ సేవ కుడు పని చేస్తున్నాడు. కనుక నేను నిద్రపోతున్నప్పుడు సయితం నా ప్రతినిధి ద్వారా నేను క్రీస్తుకి పనిచేస్తేనే ఉన్నాను.” ChSTel 199.1
అలా పని చేసే సెవెంతుడే ఎడ్వెంటిస్టులు లేరా? ఇప్పటికే సత్యం ఎరిగిన సంఘాల్లో పనిచెయ్యటానికి వాక్యపరిచారకుల్ని పోషించే బదులు ఈ సంఘాల సభ్యులు ఆ పనివారితో ఇలా చెప్పాలి: “చీకటిలో నశిస్తున్న ఆత్మల్ని రక్షించటానికి వెళ్లి పనిచెయ్యండి. సంఘ సేవల్ని మేమే నిర్వహిస్తాం. సంఘ సమావేశాల్ని మేమే జరిపిస్తాం. క్రీస్తు మాలో నివసించటం ద్వారా సంఘ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటాం. మా చుట్టు ప్రక్కల ఉన్న ఆత్మల కోసం పనిచేస్తాం. ఎక్కువ అవసరం ఎక్కువలేమి ఉన్న స్థలాల్లో సువార్త సేవకుల్ని పోషించటానికి మాద్రవ్య సహాయాన్ని పంపుతాం. వారి నిమిత్తం ప్రార్ధన చేస్తాం.” టెస్టిమొనీస్, సం.6, పు.29,30. ChSTel 199.2