ప్రభువు ఖజానాలోకి రెండు కాసులు సమర్పించిన పేద విధవరాలికి తాను చేస్తున్నదేంటో తెలియదు. ప్రతీ దేశంలో ప్రతీ యుగంలో ఆత్మత్యాగంలో ఆమె ఆదర్శం వేల ప్రజల హృదయాల పై పని చేసింది, చేస్తున్నది. అధికుల నుంచి, అల్పుల నుంచి, ధనికుల నుంచి, పేదవారి నుంచి అది దేవుని ఖజానాలోకి కానుకలు తెచ్చింది, తెస్తున్నది. అది సేవలను పోషించటానికి, ఆసుపత్రులు నెలకొల్పటానికి, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటానికి, బట్టలు లేనివారికి బట్టలివ్వటానికి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్త పర్చటానికి, బీదలకి సువార్త ప్రకటించాటినికి తోడ్పడుతున్నది. ఆమె స్వార్థరహిత క్రియ వలన వేల ప్రజలు దీవెనలు పొందుతున్నారు. టెస్టిమొనీస్, సం.6, పు.310. ChSTel 199.3