మన సేవకు సంబంధించిన పనిని గురించి ప్రగతిని గురించి మన మిత్రులుకి, ఇరుగు పొరుగువారికి వివరించే ప్రణాళికకు సుముఖంగా మాట్లాడుతూ గత సంవత్సరాల్లో నెహెమ్యా ఆదర్శాన్ని ప్రస్తావించాను. ప్రార్ధన మనిషి విశ్వాసం, సదాలోచన ఉన్న వ్యక్తి, దైవ సేవ ప్రగతికి తోడ్పడే సహాయం చెయ్యమని తన మిత్రుడు అర్తహషస్త రాజుని ధైర్యంగా అడిగిన వ్యక్తి అయిన నెహెమ్యా అనుభవాన్ని అధ్యయనం చెయ్యాల్సిందిగా మన సహోదరుల్ని సహోదరీల్ని కోరుతున్నాను. ఎమ్ఎస్, “కాన్సిక్రేటెడ్ ఎఫర్ట్స్ టు రీచ్ అన్ బిలీవర్స్” జూన్ 5, 1914. ChSTel 200.1