నెహెమ్యా ఉత్సాహ స్పూర్తిని, చిత్తశుద్దిని అనుకరించిన వారు ఇశ్రాయేలు యాజకులు. ఈ వ్యక్తులు ఆక్రమించిన ప్రభావవంతమైన హోదాల నుంచి దైవ సేవకు ఆటంకాలు కల్పించటంలోనే గాని దాని ప్రగతికి తోడ్పటంలోనే గాని వీరు చేయగలిగింది చాలా ఉంది. ప్రారంభంలోనే వారి మనఃపూర్వక సహకారం ఆ కార్య సాఫల్యానికి ఎంతో తోడ్పడింది. ప్రతీ పరిశుద్ధ కార్యంలోను ఇదే జరగాలి. సంఘంలో పలుకుబడిగల, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు దేవుని సేవలో ముందుండాలి. వారు అయిష్టంగా కదిలితే ఇతరులు కదల్నేకదలరు. అయితే “వారి ఉత్సాహం అనేకమందికి ప్రోత్సాహమిస్తుంది” వారి దీపం కాంతివంతంగా ప్రకాశిస్తుంటే ఆ జ్వాల నుంచి వెయ్యి దీపాలు ముట్టించబడతాయి. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి.5, 1904. ChSTel 204.4