ప్రజలు ఉత్సాహభరితులై ఏక మనసు ఏకాత్మ కలిగి దేశభక్తితో నిండి సంతోషానందాలతో కార్యాచరణకు పూనుకున్నారు. పలుకుబడి సమర్థత గల మనుషులు ఆయా తరగతుల ప్రజల్ని బృందాలుగా ఏర్పాటుచేశారు. ప్రతీ బృందనాయకుడు ప్రాకారంలో కొంతభాగం నిర్మించటానికి బాధ్యత వహించాల్సి ఉంది. పడిపోయిన యెరూషలేము ప్రాకారాల్ని బృందాలు సామరస్యంగా పనిచేస్తూ నిర్మించటం దేవునికి దూతలకి చూడముచ్చటగా ఉన్న దృశ్యం. తెల్లవారింది మొదలు “నక్షత్రాలు పొడిచే వరకు” పని చేస్తున్న వారు పనిముట్ల సవ్వడి వీనులకు విందుగొలిపే శబ్దం. సదర్న్ వాచ్ మేన్, ఆగ. 5, 1904. ChSTel 205.1