మనం ఇతరుల మేలు కోసం ఇతరుల్ని దీవించేందుకు ఇతరులికి ఆతిథ్యం ఇచ్చేందుకు లోకంలో నివసించాలి. మన శ్రద్ద మన సహవాసం మన గృహాల ఉపకారం వాస్తవంగా అవసరమయ్యే వారికి అతిథ్యమివ్వటంలో తరచు మనకు అసౌకర్యం కలుగుతుంది. కొందరు ఈ అనవసర భారాల్ని తప్పించుకుంటారు. కాని ఎవరో వాటిని మొయ్యాలి. సాధారణంగా సహోదరులు ఆతిథ్యప్రియులు కాకపోటం వల్ల, ఈ క్రైస్తవ విధుల్ని సమానంగా పంచుకోకపోటం వల్ల, వాటిని నిర్వహించటానికి సిద్ధంగా ఉండి, సహాయం అవసరమయ్యేవారి కేసులు తమవిగా భావించి వాటిని సంతోషంగా చేపట్టే కొద్దిమంది మీద ఎక్కువ భారం పడుతున్నది. టెస్టిమొనీస్, సం.2, పు. 645. ChSTel 223.1
“ఆతిథ్యము చేయ మరవకుడి; దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.” కాలగమనంలో ఈ మాటల శక్తి, ప్రాధాన్యం ఏమి తగ్గలేదు. మన పరలోకపు తండ్రి తన బిడ్డల మార్గంలో తరుణాల్ని పెటట్టం ఇంకా కొనసాగిస్తున్నాడు. అవి ముసుగులో ఉన్న దీవెనలు. ఈ తరుణాల్ని ఎవరు సద్వినియోగపర్చుకుంటారో వారికి అమితానందం లభిస్తుంది. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 132. ChSTel 223.2