జీవితంలోని సామాన్య ఘటనలచే దేవుడు మనల్ని పరీక్షించి నిజ నిరూపణ చేస్తాడు. చిన్న చిన్న శ్రద్దలు, జీవితంలోని అనేక చిన్న చితక సంఘటనలు, సామాన్య జీవిత మర్యాదలు - వీటి సమాహారమే జీవితానంద మకరందం. దయగల మాటలు, ఉత్సాహాన్ని అనురాగాన్ని వ్యక్తపర్చే మాటలు, జీవిత చిన్న చిన్న మర్యాదల అలక్ష్యమే దుఃఖమయ జీవిత సారాంశం. మనచుట్టుపట్ల ఉన్నవారి శ్రేయం ఆనందం నిమిత్తం స్వార్థాన్ని ఉపేక్షించటం పరలోకంలోని మన జీవిత రికార్డులో ప్రధానమై ఉంటుందని తుదకు తేలుతుంది. టెస్టిమొనీస్, సం. 2, పు. 133. ChSTel 223.3
విధవరాండ్రు, అనాధలు, గుడ్డివారు, కుంటివారు అనేక రకాలుగా బాధ అనుభవించే వారు తన సంఘాల్లోని క్రైస్తవులికి దగ్గర సంబంధంలో ఉంచటం తన కృప చొప్పున దేవుడు చేసిన పని అని నేను దర్శనంలో చూశాను. తన ప్రజల్ని పరీక్షించి వారి వాస్తవ ప్రవర్తనను వృద్దిపర్చటానికి ఆయన ఈ పని చేస్తాడు. మన సానుభూతి, ప్రేమ, స్వార్థరహిత ఔదార్యం అవసరమైన ఈ వ్యక్తుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నామో దేవదూతలు పరిశీలనగా చూస్తున్నారు. ఇది మన ప్రవర్తనల్ని పరీక్షించటానికి దేవుడు జరిపే పరీక్ష. మనకు యధార్థమైన బైబిలు మతం ఉంటే, తన సహోదరుల పక్షంగా ప్రేమ విషయంలోను, కనికరం విషయంలోను, ఆసక్తి విషయంలోను మనం క్రీస్తుకి రుణస్తులమై ఉన్నామని, మనం ఇంకా పాపులం అయోగ్యులం అయి ఉండగా ఆయన మనపట్ల కనపర్చిన తన కృపకు అపార ప్రేమకు, మనం మనకన్నా ఎక్కువ అవసరంలో ఉన్న మన సహోదరులపట్ల ప్రగాఢ ఆసక్తి స్వార్థరహిత ప్రేమ చూపించటం మన కనీస ధర్మమని గుర్తిస్తాం. టెస్టిమొనీస్, సం. 3, పు. 511. ChSTel 224.1