పెండ్లి అయిన పరుషులు పిల్లల్ని చూసుకోటానికి భార్యల్ని ఇంటి వద్ద విడిచి పెట్టి సువార్త పనికివెళ్ళే, భర్త ఎంత గొప్ప పని ఎంత ప్రాముఖ్యమైన పని చేస్తున్నాడో బార్య కూడా అంతే గొప్ప పని అంతే ప్రాముఖ్యమైన పని చేస్తున్నది. ఒకరు మిషను సేవా రంగంలో ఉన్నారు. ఇంకొకరు గృహ మిషనెరీ సేవ చేస్తున్నారు. ఆమె చింతలు, ఆందోళనలు, భారాలు భర్త భారాల కన్నా ఎంతో ఎక్కువ. ఆమె పని గంభీరమైంది, ప్రాముఖ్యమైంది. అది మనసుల్ని మూసపొయ్యటం, ప్రవర్తనల్ని రూపుదిద్దటం, ఇక్కడ ప్రయోజకులుగా నివసించటానికి, భవిష్యత్ నిత్య జీవానికి వారిని తర్బీతు చెయ్యటం. మిషనెరీ సేవా రంగంలో ఉన్న భర్త మనుషుల గౌరవాన్ని ప్రశంసల్ని పొందవచ్చు. గృహంలో కష్టపడి సేవ చేసే భార్య తన సేవకు లౌకికంగా ఎలాంటి గుర్తింపు పొందదు. కాగా ఆమె తమ బిడ్డల్ని దైవాదర్శం ప్రకారం తీర్పుదిద్దుతూకుటుంబశ్రేయస్సుకు పాటు పడ్తుంటే, రికార్డు రాసే దూత ఆమె పేరుని లోకంలో అత్యున్నత మిషనెరీల్లో ఒకరిగా నమోదు చేస్తాడు. పరిమితులు గల మానవుడు చూసేటట్లు దేవుడు చూడడు. టెస్టిమొనీస్, సం. 5, పు. 594. ChSTel 241.2