అందరూ ఏదో కొంత చెయ్యవచ్చు. తప్పించుకునే ప్రయత్నంలో కొందరు “నా ఇంటి పనులుకి నా పిల్లలకి నా సమయం నా డబ్బు” అయిపోతున్నాయి అంటారు. తల్లిదండ్రులారా, ప్రభువు సేవ చెయ్యటానికి మీ శక్తిని మీ సామర్ధ్యాన్ని పెంచటానికి మీ పిల్లలు మీకు చెయ్యూత నివ్వాలి. పిల్లలు దేవుని కుటుంబంలో చిన్నారి సభ్యులు. తమను తాము దేవునికి సమర్పించుకోటానికి తల్లిదండ్రులు వారిని నడిపించాలి. సృష్టిపరంగాను, విమోచన పరంగాను వారు ఆయన సొత్తు. తమ శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన శక్తులన్నీ ఆయనవని వారికి నేర్పించాలి. వివిధ శాఖల్లో స్వార్థరహిత సేవ చెయ్యటానికి వారికి శిక్షణ ఇవ్వాలి. మీ బిడ్డలు మీకు అడ్డు బండలు కానివ్వకండి. ఇతరులికి సహాయం చెయ్యటం ద్వారా వారు తమ సంతోషాన్ని ప్రయోజకత్వాన్ని పెంపు చేసుకుంటారు. టెస్టిమొనీస్, సం. 7, పు. 63. ChSTel 242.1