క్రమబద్ధమైన క్రైస్తవ కటుంబం క్రైస్తవ మత వాస్తవికత పక్షంగా శక్తిమంతమైన వాదం; నాస్తికుడు కాదనలేని వాదం. ఆ కుటుంబంలో పని చేసే ఓ ప్రభావం పిల్లల్ని తీర్చి దిద్దుతుందని, అబ్రాహాము దేవుడు వారితో ఉన్నాడని అందరూ చూడగలుగుతారు. క్రైస్తవులమని చెప్పుకునేవారి గృహాలు సరి అయిన మతాన్ని ఆచరిస్తూ నివసిస్తే వారి ప్రభావం మంచిని ప్రోత్సహిస్తుంది. వారు వాస్తవంగా “లోకమునకు వెలుగై” ఉంటారు. పెట్రీయార్క్స్ అండ్ ప్రొఫెట్స్, పు. 144. ChSTel 242.2
కుటుంబం సేవ కుటుంబ సభ్యుల్ని దాటి విస్తరిస్తుంది. క్రైస్తవ గృహం జీవిత వాస్తవ నియమాల్ని ఉదాహరించే సాదృశ్య పాఠంగా ఉండాలి. అట్టి ఉదాహరణ లోకంలో మంచికి తోడ్పడే మహాశక్తిగా ఉంటుంది. యధార్ధమైన గృహం మానవ హృదయాలు జీవితాల పై చూపే ప్రభావం గొప్ప ప్రసంగం కన్నా ఎంతో బలంగా పనిచేస్తుంది. అలాంటి గృహం నుంచి యువత బయటికి వెళ్లినప్పుడు, వారు నేర్చుకున్న పాఠాల్ని ఇతరులుకి అందిస్తారు. ఉత్తమ జీవన నియమాలు ఇతర గృహాలకు పరిచయమవ్వటం సమాజ సముద్ధరణకు దోహదపడే ప్రభావం పని చెయ్యటం జరుగుతుంది. ది మినిస్ట్రీస్ ఆఫ్ హీలింగ్, పు. 352. ChSTel 242.3
క్రైస్తవ్యం శక్తిని లోకానికి సమర్పించగల ఉత్తమ నిదర్శనం క్రమబద్దమైన, క్రమ శిక్షణగల గృహం. ఇది సిఫారసు చేసినట్లు సత్యాన్ని మరేదీ సిఫారసు చెయ్యలేదు. ఎందుకంటే హృదయంపై దాని ఆచరణాత్మక శక్తికి అదే ఓ సజీవ సాక్ష్యం. టెస్టిమొనీస్, సం. 4, పు. 304. ChSTel 243.1
లోకంలోని కుటుంబాలు పరలోక కుటుంబానికి ప్రతీకగా ఉండాలన్నది దేవుని సంకల్పం. దేవుని ప్రణాళిక ప్రకారం స్థాపితమై నడిచే క్రైస్తవ గృహాలు క్రైస్తవ ప్రవర్తన నిర్మాణానికి, దేవుని సేవ పురోగతికి గొప్ప శక్తిగల సాధనాలు. టెస్టిమొనీస్, సం. 6, పు. 430. ChSTel 243.2
మన ప్రభావ పరిధి సంకుచితంగా, మన సామర్థ్యం తక్కువగా, మన తరుణాలు కొద్దిగా, మన సాధనలు పరిమితంగా ఉన్నట్లు కనిపించవచ్చు. అయినా మన సొంత గృహాలు సమకూర్చే తరుణాల్ని నమ్మకంగా ఉపయోగించటం ద్వారా అద్బుతమైన తరుణాలు మనవి అవుతాయి. మనం మన హృదయాల్ని మన గృహాల్ని దైవ నియమాలకి తెరిస్తే, జీవ శక్తి ప్రవహించే కాలువలవుతాం. మన గృహాల నుంచి స్వస్తత ఏరులై ప్రవహిస్తూ, ప్రస్తుతం ఎడారి, మరణం ఎక్కడున్నాయో అక్కడికి జీవాన్ని, సౌందర్యాన్ని, ఫంటల్ని తెస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 355. ChSTel 243.3