Go to full page →

సమావేశాల్ని ఆశాజనకం చెయ్యటం ChSTel 246

మిషనెరీ సమావేశాన్ని ఆసరాచేసుకుని మిషనెరీ సేవ ఎలా చెయ్యాలో ప్రజలకి నేర్పండి. ఆపీల్ టు అవర్ చర్చెస్, పు. 11. ChSTel 246.3

మన ప్రార్ధన సమావేశాలు, సాంఘిక సమావేశాలు ప్రత్యేక సహాయానికి ప్రోత్సాహానికి సమయాలు కావాలి. ఈ సమావేశాల్ని సాధ్యమైనంత ఆశాజనకంగాను ప్రయోజనకరంగాను చెయ్యటానికి ప్రతీ వ్యక్తికి ఓ పని ఉంటుంది. దైవ విషయాల్లో ప్రతి దినం తాజా అనుభవాన్ని పొందటం ద్వారా, ఆయన ప్రజల సమావేశాల్లో ఆయన ప్రేమను గూర్చి మాట్లాడటానికి వెనకాడకుండటం ద్వారా దీన్ని ఉత్తమంగా చెయ్యవచ్చు. మీరు మీ హృదయాల్లోకి చీకటిని లేదా అవిశ్వాసాన్ని అనుమతించకుండా ఉంటే అది మీ సమావేశాల్లో తల ఎత్తదు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 7, 1905. ChSTel 246.4

మన సమావేశాలు ఆసక్తికరంగా ఉండాలి. అవి పరలోక వాతావరణాన్ని సంతరించుచుకోవాలి. చప్పని దీర్ఘ ప్రసంగాలు, కేవలం సమయం ఆక్రమించటానికి చేసే లాంఛన ప్రాయ ప్రార్ధనలు మానండి. అందరు తమ తమ పాత్రని సమయ పాలనతో నిర్వహించటానికి సిద్ధంగా ఉండాలి. విధి ముగిసినప్పుడు సమావేశం సమాప్తమవ్వాలి. ఇలా ఆసక్తిని చివరి దాకా నిలపవచ్చు. ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆయన ఆరాధనను ఆశాజనకంగాను ఆకర్షణీయంగాను చెయ్యాలి. అది సారంలేని ఆచారం స్థాయికి దిగజారకూడదు. మనం నిమిష నిమిషం, గంట గంట, దిన దినం క్రీస్తు కోసం నివసించాలి. అప్పుడు క్రీస్తు మనలో నివసిస్తాడు. మనం సమావేశమైనప్పుడు ఆయన ప్రేమ మన హృదయాల్లో ఉంటుంది. అది ఎడారిలో ఏరులా ప్రవహిస్తూ అందరినీ సేదదీర్చుతూ, నశించటానికి సిద్ధంగా ఉన్న వారిని జీవజలాలు ఆత్రంగా తాగేటట్లు చేస్తుంది. టెస్టిమొనీస్, సం. 5, పు. 609. ChSTel 247.1

మిషనెరీ సమావేశానికి వెళ్లి దీర్ఘ ప్రసంగం చెయ్యటం ద్వారా యువజనుల ఆసక్తిని మేల్కొల్పగలమని ఊహించకండి. ఆసక్తిని మేలు కొల్పే మారాల్ని యోచించండి. ప్రతీవారం యువత తాము రక్షకునికి ఏమి చెయ్యటానికి ప్రయత్నించారో, ఏ విజయం సాధించారో తెలిపే నివేదికలు తేవాలి. అలాంటి నివేదికలు తేవటానికి మిషనెరీ సమావేశాన్ని ఓ వేదిక చేస్తే అది నిస్తేజంగా, ఆయాసకరంగా, నిరాసక్తంగా ఉండదు. అది ఆసక్తికరంగా ఉంటుంది. దానికి చాలామంది హాజరవుతారు. గాస్ఫుల్ వర్కర్స్, పులు. 210, 211. ChSTel 247.2

క్రీస్తు పై విశ్వాసం నిలిచినప్పుడు సత్యం ఆత్మకు ఆనందాన్నిస్తుంది. మతారాధనలు చప్పగా నిరాసక్తంగా ఉండవు. ఇప్పుడు జీవం ఉత్సాహంలేని మీ సాంఘిక సామావేశాలు పరిశుద్దాత్మ వలన ఉజ్జీవనం పొందుతాయి. మీరు విశ్వసించే క్రైస్తవ్యాన్ని మీరు ఆచరించేకొద్దీ రోజుకి రోజు మీ అనుభవం పరిపుష్టమౌతుంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 437. ChSTel 247.3