యధార్థ క్రైస్తవ ఉత్సాహం, అంటే ఏదోకొంత పని చెయ్యటానికి కనపర్చే ఉత్సాహం, కావాలి.... నయాగరా జలపాతాన్ని ఆపటం ఎంత కష్టమో క్రీస్తు తన హృదయంలో ఉన్న ఆత్మను ఆయన్ని గూర్చి సాక్ష్యమివ్వకుండా ఆపటం అంత కష్టం . టెస్టిమొనీస్, సం.2, పు. 233. ChSTel 269.1
యేసుని తన స్వరక్షకుడిగా అంగీకరించిన ప్రతీవ్యక్తి ఆయన సేవచేసే ఆధిక్యతను కోరుకుంటాడు. పరలోకం తనకు చేసిన మేలును ధ్యానిస్తూ తన హృదయంనిండా ప్రేమను కృతజ్ఞతను నింపుకుంటాడు. తన సమర్ధతల్ని దేవుని సేవకు అంకితం చెయ్యటం ద్వారా తన కృతజ్ఞతను చూపించుకుంటాడు. క్రీస్తు పట్ల ఆయన కొన్న ఆత్మల పట్ల తన ప్రేమను కనపర్చుతాడు. అతడు శ్రమను, బాధల్ని, త్యాగాన్ని ఆశిస్తాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 502. ChSTel 269.2
క్రీయాశీలమైన మత సేవలో ఉత్సాహం గల మార్తాలకు విశాల సేవా రంగం ఉంది. అయితే వారు ముందు మరియతో కలిసి యేసు పాదాల వద్ద కూర్చోవాలి. శ్రద్ద, సత్వరత, శక్తి క్రీస్తు కృప ద్వారా ప్రతిష్ఠితమవ్వాలి. అప్పుడు జీవితం మేలు చెయ్యటానికి అజేయమైన శక్తిగా మారుతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 525. ChSTel 269.3
క్రీస్తు పరిచర్యలో ప్రదర్శించిన అవిశ్రాంత శ్రమ, అపార ఉత్సాహం మనం ప్రభువు నామంలో ఆయన సేవ ప్రగతికి శ్రమించటంలో ప్రదర్శించాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 25. ChSTel 269.4
మన మతపరమైన సేవలో మనం ఏకరూపతను విడనాడాలి. లోకంలో మనం ఓ పనిని చేస్తున్నాం కాని చాలినంత క్రియాత్మకత ఉత్సాహం కనపర్చటం లేదు. మనం ఎక్కువ శ్రద్ద వహిస్తే మన వర్తమానంలోని సత్యాన్ని మనుషులు నమ్ముతారు. జీవం లేని, ఎప్పుడు ఒకేలా ఉండే మన దైవారాధన గాఢమైన, చిత్తశుద్ధితో నిండిన పరిశుద్ద ఆవేశం చూడాల్సిన హెచ్చుతరగతికి చెందిన అనేకమందిని తరిమివేస్తున్నది. టెస్టిమొనీస్, సం.6, పు. 417. ChSTel 269.5