క్రీస్తు జత పనివారవ్వటానికి మీరు ఎవరి రక్షణకోసం పని చేస్తున్నారో వారి పట్ల ఓర్పు సహనం కలిగి మెలగాలి. సామాన్యమైన ఆసేవను తిరస్కార భావంతో చూడకూడదు. దీవెనకరమైన ఫలితాన్ని మనసులో ఉంచుకుని చూడాలి. మీరు ఎవరి రక్షణ కోసం కృషిచేస్తున్నారో వారు మిలో మంచి అభిప్రాయం కలిగించుకపోతే “వీళ్లని రక్షించటం దండగ” అని మీరు మనసులో అనుకుంటారు. అంటరాని వారి పట్ల క్రీస్తు ఇలాగే ప్రవర్తించి ఉంటే ఏం జరిగేది? ఆయన ఘోర పాపుల్ని రక్షించటానికి మరణించాడు. ఫలితాన్ని దేవుని చేతిలో ఉంచి, మీరు వెంబడిస్తున్న క్రీస్తు ఆదర్శం సూచిస్తున్నట్లు మీరు అదే స్పూర్తితో అదే రీతిగా పనిచేస్తే, మీరు చేస్తున్న మేలు అంతని ఇంతని ఈ జీవితంలో ఎన్నడూ కొలిచి చెప్పలేం. టెస్టిమొనీస్, సం.4, పు. 132. ChSTel 270.1
మీరు ఎవర్ని కలుస్తారో వారందరి రక్షణ కోసం నిస్వార్థంగా, అనురాగ పూర్వకంగా సహనశీలంతో కృషి చెయ్యండి. దయలేని మాట ఒక్కటి కూడా పలకకండి. క్రీస్తు ప్రేమను మా హృదయంలోను దయా నిబంధనను మా పెదవుల పైన ఉంచుకోండి. టెస్టిమొనీస్, సం.9, పు. 41. ChSTel 270.2