మీరు వెళ్లి విశ్వసించేవారందరినీ నా పేరట సంఘంలో చేర్చండి అని క్రీస్తు తన శిష్యుల్ని ఆదేశించినప్పుడు, సామాన్యతను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన వారి ముందు పెట్టాడు. ఎంత తక్కువ హంగు ఆర్భాటం ఉంటే, మంచిని ప్రోత్సహించటానికి వారి ప్రభావం అంత బలంగా ఉంటుంది. క్రీస్తు ఎంత సామాన్యంగా మాట్లాడాడో అంతే సామాన్యంగా శిష్యులు మాట్లాడాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 28. ChSTel 273.4
వేలమందిని అతి సామాన్యమైన మార్గంలో చేరవచ్చు. లోకంలో గొప్ప జ్ఞానులుగా గొప్ప వరాలు కలిగిన వారిగా పేరు గాంచిన పురుషులు స్త్రీలని, ఓ లౌకికుడు తనకు ఆసక్తి గొలిపే విషయాల గురించి ఎంత ఆసక్తిగా మాట్లాడాడో అంత స్వాభావికంగా దేవుని ప్రేమించి ఆ ప్రేమను గురించి మాట్లాడే వ్యక్తి సామాన్యమైన మాటలు సేదదీర్చగలుగుతాయి. తరచు బాగా అధ్యయనం చేసి సిద్ధం చేసుకున్న మాటలు ఉపయోగపడవు. కాని దేవుని ఓ కుమారుడు కుమార్తె పలికే వాస్తవమైన, యాథార్థమైన మాటలు, స్వాభావిక సామాన్యతతో పలికే మాటలు దీర్ఘకాలంగా మూతపడి వున్న హృదయ ద్వారాన్ని తెరిచే శక్తి కలిగి ఉంటాయి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 232. ChSTel 274.1