దేవుని పనివారు ఆయన పై విశ్వాసముంచటం అవసరం. వారి పరిశ్రమను ఆయన గుర్తించకపోడు. వారు చేసే పని ఆయన దృష్టిలో ఎంతో విలువైంది. దేవుని జత పనివారికి సహకరించటానికి దైవ ప్రతినిధులు నియమితులవుతారు. తాను చెప్పింది దేవుడు చెయ్యడని, తన పనివారిని ఆయనను గుర్తించడని మనం తలంచినప్పుడు, మన సృష్టికర్తను అవమానపర్చుతాం. సదర్న్ వాచ్ మేన్, ఆగ.2, 1904. ChSTel 274.2
దేవుని సేవకుడికి బలమైన విశ్వాసం అసవరం. పై రూపాలు నిషిద్ధంగా కనిపించవచ్చు. అయితే మిక్కిలి చీకటి గడియలో అవతల వెలుగు ఉంటుంది. విశ్వాసంతో దేవున్ని ప్రేమించి సేవించేవారి బలం దినదినం నూతనమౌతుంది. గాసిపుల్ వర్కర్స్, పు. 262. ChSTel 274.3
నిజమైన విశ్వాసంలో ఉత్సాహం, నిశ్చల నియమం దృఢ సంకల్పం ఉన్నాయి. దాన్ని కాలంగాని శ్రమగాని బలహీనపర్చలేదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 147. ChSTel 274.4
క్రైస్తవ జీవితం తరచు అపాయాలతో నిండటం వల్ల విధి నిర్వహణ కష్టమనిపిస్తుంది. ముందు నాశనమున్నట్లు వెనక దాస్యం లేదా మరణం ఉన్నట్లు ఆలోచన చిత్రించుకుంటుంది. అయినా దేవుని స్వరం స్పష్టంగా “ముందుకి సాగండి” అంటుంది. మన దృష్టి చీకటిలో నుంచి చొచ్చు కుపోలేనప్పటికీ, మన పాదాల్ని చల్లని కెరటాలు చుట్టుముట్టుతున్నప్పటికీ మనం ఆ ఆజ్ఞకు విధేయులమవ్వాలి. మన పురోభివృద్ధిని అడ్డుకుంటున్న సమస్యలు ఊగీసలాడే, సందేహించే స్వభావం ముందు మాయమవ్వవు. ప్రతీ సందేహం తొలగిపోయి వైఫల్యానికి లేక అపజయానికి ఆస్కారం లేకుండా ఉండేంత వరకు విధేయతను వాయిదావేసేవారు ఎన్నడూ విధేయులవ్వరు. “ప్రతిబంధకాలు తొలగిపోయే వరకు, మార్గం స్పష్టంగా కనిపించే వరకు ఆగుదాం” అంటూ అవిశ్వాసం చెవిలో ఊదుతుంది. కాని ముందుకి సాగమంటూ అన్నిటినీ నిరీక్షించమంటూ, అన్నిటినీ నమ్మమంటూ విశ్వాసం విజ్ఞాపన చేస్తుంది. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 290. ChSTel 274.5