గొప్ప సేవ చెయ్యాల్సి ఉంది. విస్తృత ప్రణాళికల్ని, తయారు చెయ్యాలి. జాతుల్ని మేల్కొల్పటానికి ఓ స్వరం వినిపించాలి. ప్రాముఖ్యమైన ఈ క్లిష్ట సమయంలో బలహీన విశ్వాసం కలిగి తడబడే మనుషులు సేవను ముందుకు నడిపించాల్సిన వ్యక్తులు కారు. మనకు వీరుల సాహసం, హతసాక్షుల విశ్వాసం అవసరం. టెస్టిమొనీస్, సం. 5, పు. 187. ChSTel 275.1
మనం విశ్వాసంతో ఆయన శక్తిమీద ఆనుకున్నప్పుడు, మిక్కిలి నిరుత్సాహకరమైన దృక్పధాల్ని ఆయన మార్చుతాడు. అద్భుతంగా మార్చుతాడు. ఇది తన నామ మహిమ నిమిత్తం ఆయన చేస్తాడు. విశ్వసించే వారు నిరీక్షణ లేని వారితో ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడాల్సిందిగా దేవుడు తన విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. మనం ఒకరికొకరం సహాయం చేసుకోటానికి సజీవ విశ్వాసం ద్వారా ఆయన ఉన్నాడని నిరూపించటానికి దేవుడు మనకు సహాయం చేయును గాక! టెస్టిమొనీస్, సం. 8, పు. 12. ChSTel 275.2
దేవుని సేవను పరిపూర్ణం చెయ్యటానికి నిరీక్షణ, ధైర్యం అత్యవసరం. ఇవి విశ్వాస ఫలాలు. నిరాశ పాపం. అది అనుచితమైంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 164. ChSTel 275.3
వారికి ధైర్యం, శక్తి, పట్టుదల ఉండాలి. పైకి అసాధ్యాలుగా కనిపించేవి వారి మార్గాన్ని అడ్డుకున్నప్పటికీ, దైవ కృప ద్వారా వారు ముందుకి వెళ్లాలి. కష్టాల్ని గర్జించే బదులు అధిగమించాలి. వారు దేని గురించీ నిస్సహ చెందకూడదు. ప్రతీదాన్నీ నిరీక్షించాలి. క్రీస్తు వారిని సాటిలేని ప్రేమ అనే బంగారు గొలుసుతో దేవుని సింహాసనానికి అనుసంధాన పర్చాడు. సర్వశక్తికి మూలమైన ఆయన నుంచి వచ్చే అత్యున్నత ప్రభావం వారిదవ్వాలన్నది. ఆయన ఉద్దేశం. దుష్టిని ప్రతిఘటించటానికి వారికి శక్తి కావాలి. అది. భూమి గాని, మరణంగాని, పాతాళం గాని అధిగమించలేని శక్తి. అది క్రీస్తు జయించినట్లు జయించటానికి వారిని బలోపేతుల్ని చేసే శక్తి. గాస్ఫుల్ వర్కర్స్, పు. 39. ChSTel 275.4