నెహెమ్యా దేవుని సహాయానికి ప్రార్ధన చేస్తుండగా, యెరూషలేము పునరుద్ధరణ అన్న తన ఉద్దేశం సఫలమవ్వటం విషయంలో తనకిక చింత గాని బాధ్యత గాని లేనట్లు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ కార్య సాఫల్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చెయ్యటానికి గొప్ప దూర దృష్టి ముందు జాగ్రత్తతో ముందుకి సాగాడు. ప్రతీ అడుగూ ఆచి తూచి వేశాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 280.2
దైవ ప్రజలు విశ్వాసంతో ప్రార్ధించటమే కాక జాగ్రత్తగా నమ్మకంగా పనిచెయ్యాలన్న పాఠం ఈ పరిశుద్దుడి (నెహెమ్యా) ఆదర్శం నేర్పుతున్నది. దూరదృష్టి, ముందు జాగ్రత్త, కష్టపడి పని చెయ్యటం వీటికి మతంతో సంబంధం లేదని తలంచటం వల్ల మనం ఎన్ని సమస్యల్ని ఎదుర్కుంటాం! మన పక్షంగా దేవుని కృపా సంకల్పం చేస్తున్న పనిని మనం ఎంత తరచుగా అడ్డుకుంటాం! ఇది తీవ్ర తప్పిదం. దేవుని సేవను ఎక్కువ సమర్థంగా చేసే పని వారిగా మనల్ని తీర్చి దిద్దే ప్రతీ శక్తిని సామర్ధాన్ని వృద్ధి పర్చుకుని వినియోగించటం మన విహిత కర్తవ్యం. నెహెమ్యా కాలంలోలాగే ఈనాడు మన పవిత్ర సేవ విజయానికి జాగ్రత్తతో కూడిన ఆలోచన, ఆచిచూచి రచించిన ప్రణాళికలు అవశ్యం. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 281.1