దైవ సేవకులికి ప్రతీ రకమైన అధైర్యం ఎదురవ్వవచ్చు. వారికి కలిగే శ్రమలు శత్రువుల ఆగ్రహం, క్రూరత్వం, తిరస్కారం వల్ల మాత్రమే కాదు; మిత్రులు సహాయకుల సోమరితనం, అస్థిరత, ఉదాసీనత, విశ్వాసఘాతుకత వల్ల కూడా... దేవుని సేవ ముందుకి సాగాలని కోరుకునేవారు సయితం శత్రువుల అపనిందల్ని, బింకాల్ని, బెదిరింపుల్ని వినటం, అక్కడిక్కడ చెప్పటం, వాటిని సగం నమ్మటం ద్వారా దేవుని సేవకుల చేతుల్ని బలహీన పర్చుతారు. గొప్ప ఆశాభంగాల నడుమ నెహెమ్యా దేవుని బలంమీద ఆధారపడ్డాడు. మన భద్రత ఇక్కడే ఉంది. ప్రభువు మనకు ఏమి చేశాడో స్మరణకు తెచ్చుకోటం ప్రతీ అపాయంలోను గొప్ప బలాన్నిస్తుంది. “తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” “దేవుడు మన పక్కఉంటే మనకు ఎవరు వ్యతిరేకంగా ఉండగలరు?” సాతాను అతడి ప్రతినిధులు ఎంత కుటిలంగా కుట్రలు చేసినప్పటికీ దేవుడు వాటిని కని పెట్టి వారి ఆలోచనల్ని నిరర్ధకం చేస్తాడు. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 19, 1904. ChSTel 281.2
ఓ ప్రత్యేక సేవ చేసేందుకు సంఘర్షణ పడుతున్న వారిని పరిశుద్ధాత్మ ఒత్తిడి చేస్తే, ఆ ఒత్తిడి తొలగించబడ్డప్పుడు వారిలో తరచు ఓ ప్రతికూల భావన ఏర్పడుతుంది. నిరాశ మిక్కిలి పటిష్టమైన విశ్వాసాన్ని కదిల్చి మిక్కిలి స్థిర చిత్తాన్ని బలహీన పర్చవచ్చు. అయితే దేవుడు గ్రహిస్తాడు. ఆయన ఇంకా జాలిపడతాడు, ప్రేమిస్తాడు. హృదయంలోని ధ్వేయాల్ని ఉద్దేశాల్ని చదువుతాడు. ఓర్పుతో నిరీక్షించటం, అంతా చీకటిగా ఉన్నట్లు కనిపించినప్పుడు నమ్మటం అన్న పాఠాన్ని దైవ సేవలోని నాయకులు నేర్చుకోవాలి. వారి శ్రమ దినాన పరలోకం వారిని విడిచి పెట్టదు. తన శూన్యతను వట్టితనాన్ని గుర్తించి, పూర్తిగా దేవునిమీద ఆధారపడే ఆత్మ అంత నిస్సహాయమయ్యిందిగా కనిపించవచ్చు, అయినప్పటికీ దానంత అజేయమయ్యింది ఇంకేదీలేదు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 174, 175. ChSTel 282.1
సేవను దాని అనంగీకార లక్షలన్నింటితో చేపట్టే, అపజయం పొందని, అధైర్యపడని, సైనికుల్ని ప్రభువు పిలుస్తున్నాడు. మనమందరం క్రీస్తుని ఆదర్శంగా తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 17, 1894. ChSTel 282.2
పౌలు అతడి సహచరుల బోధకు - క్రైస్తవులుగా చెప్పుకునే వారి నుంచి సయితం - తాము ఎవరి మధ్య నివసించారో ఆ ప్రజల నుంచి వచ్చిన స్పందనకన్నా మెరుగై స్పందన రాకపోతే నేడు ప్రజాదరణ లేని సత్యాల్ని బోధించేవారు అధైర్యపడనవసరం లేదు. ఈ సిలువ దూతలు మెలకువగా ఉండి ప్రార్ధన చెయ్యటం ద్వారా తమను తాము బలపర్చుకుని ఎల్లప్పుడు క్రీస్తు నామంలో పనిచేస్తూ విశ్వాసంతోను ధైర్యంతోను ముందుకి సాగాలి. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 230. ChSTel 282.3