రెచ్చగొట్టినప్పుడు సాధు స్వభావం కనపర్చటం సత్యం తరపున శక్తిమంతమైన వాదన కన్నా బలీయమైన ప్రభావంగా పని చేస్తుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 353. ChSTel 282.4
మనుషుల పొరపాట్లు దిద్ది వారిని రక్షించటానికి ప్రయత్నించేటప్పుడు ఎండిపోతున్న మొక్కలపై పడే పొగమంచులా, సన్నని చినుకుల్లా మాటలు మృదువుగా ఉండాలి. ముందు హృదయాన్ని చేరటం దేవుని ప్రణాళిక. జీవితాన్ని సంస్కరించే శక్తిని ఆయన ఇస్తాడని విశ్వశిస్తూ మనం సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. ప్రేమతో పలికిన మాటను హృదయాన్ని మార్చటానికి పరిశుద్ధాత్మ వినియోగిస్తాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 157. ChSTel 282.5
మృదు స్వభావం, సాధు ప్రవర్తన అపరాధిని రక్షించి, అనేక పాపాల్ని పరిహరించవచ్చు. మీ ప్రవర్తనలో క్రీస్తుని కనపర్చటం మీరు కలిసేవారందరి పై పరివర్తన కలిగించే ప్రభావాన్ని చూపుతుంది. క్రీస్తుని ప్రతి దినం మీలో కనపర్చండి. అప్పుడు ఆయన తన మాటల్లోని సృజన శక్తిని మా ద్వారా బయలు పర్చుతాడు - అది మన ప్రభువైన దేవుని సుందర రూపంలో ఇతర ఆత్మల్ని తిరిగి సృజించే సున్నితమైన, ఒప్పించే, శక్తిమంతమైన ప్రభాం. తాల్స్ ఫ్రమ్ ది మౌంట్ ఆఫ్ బ్లెసింగ్, పు. 129. ChSTel 283.1