స్వచ్ఛమైన ప్రేమతో ఏది చేసినా, అది ఎంత స్వల్పమైంది అయినా లేక ఇతరుల దృష్టిలో ఎంత తిరస్కరించదగింది అయినా, అది పూర్తిగా ఫలప్రదమౌతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత చేస్తాడు అన్నదానికన్నా ఎంత ప్రేమతో చేస్తాడు అన్న దాన్ని దేవుడు పరిగణిస్తాడు. టెస్టిమొనీస్, సం. 2, పు. 135. ChSTel 308.3
నిజంగా మారు మనసు పొందిన, సిద్దమనసుగల, స్వార్థపరులు గాని పదిమంది పనివారు, ఆచారాలు లాంఛనాలకి కటుట్బడి, యాంత్రికమైన నిబంధనల్ని పాటిస్తూ, ఆత్మలపట్ల గాఢమైన ప్రేమ లేకుండా పనిచేసే వందమందికన్నా మిషనెరీ సేవా రంగంలో ఎక్కువ సేవ చేయగలుగుతారు. టెస్టిమొనీస్, సం. 4, పు. 602. మీకు జయాన్నిచ్చేది ఇప్పుడు మీకున్న లేక ముందు మీరు సంపాదించనున్న సమర్థతలు కావు. ప్రభువు మీకు ఏమి చెయ్యగలడో అది. మనం మానవుడు చెయ్యగల దాని పై తక్కువ నమ్మక ముంచటం, నమ్మే ప్రతీ ఆత్మకు దేవుడు చెయ్యగల దాని పై ఎక్కువ నమ్మకముంచటం అవసరం. మీరు విశ్వాసం ద్వారా తనను చేరటం ఆయన చిత్తం. ఆయన నుంచి గొప్ప కార్యాలకు మీరు కని పెట్టాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. లౌకికమైన, ఆధ్యాత్మికమైన విషయాల్లో మీకు అవగాహన ఇవ్వాలన్నది ఆయన కోరిక. ఆయన మనకు చురుకైన బుద్ధిని ఇవ్వగలడు. నేర్పును నిపుణతను ఇవ్వగలడు. మా వరాల్ని ఆయన సేవలో ఉపయోగించండి. వివేకం కోసం ప్రార్ధించండి. దాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 146. ChSTel 308.4
కృపా తైలం మనుషులికి ధైర్యం కలిగించి, తమకు దేవుడు నియమించిన పనిని దినదినం చెయ్యటానికి వారికి ధ్యేయాల్పిస్తుంది. బుద్దిలేని ఆ అయిదు మంది కన్యకలకి దివిటీలు (లేఖన సత్యజ్ఞానం) ఉన్నాయి. కాని వారికి క్రీస్తు కృపలేదు. దినదినం వారు యధావిధి ఆచారాలు, బహిర్గత విధులు నిర్వహించారు. కాని వారి సేవ నిర్జీవంగా, క్రీస్తు నీతి లేకుండా సాగింది. వారి హృదయాల్లోను మనసుల్లోను నీతి సూర్యుడు ప్రకాశించలేదు. - క్రీస్తు స్వరూపం, పైరాతపట్ల - వారికి ఆసక్తి లేదు. వారి కృషితో కృపాతైలం మిళితం కాలేదు. వారి మతం గింజలేని ఊక. వారు ఆచారాన్ని సిద్దాంతాన్ని గట్టిగా పట్టుకున్నారు. స్వనీతితో నిండిన తమ క్రైస్తవ జీవితంలో వారు మోసపోయారు. క్రీస్తు పాఠశాలలో పాఠాలు నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే అవి వారిని రక్షణ విషయంలో వివేకవంతుల్ని చేసేవి. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 27, 1894. ChSTel 309.1
దేవుని సేవ దైవ ప్రతినిధులు మానవ ప్రతినిధుల సహకారంతో పూర్తి అయ్యే వరకు కొనసాగాల్సి ఉంది. స్వయం సమృద్ధులైన వారు దేవుని సేవలో క్రియాశీలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే వారు ప్రార్ధించకుండా ఉంటే వారి క్రియాశీలత నిరుపయోగం. ఇంద్రధనస్సు చుట్టి ఉన్న దైవ సింహాసనం ముందున్న బంగారు బలిపీఠం వద్ద నిలబడి ఉండే దూత ధూపార్తిలోకి చూడగలిగితే మన ప్రార్ధనలు ప్రయత్నాలతో క్రీస్తు నీతి సమ్మిళితమవ్వాలని, లేకపోతే అవి కయీను అర్పణలో విలువలేనివవుతాయని వారు గుర్తిస్తారు. మానవ ప్రతినిధుల కార్యకలాపాలన్నీ దేవుని దృష్టికి కనిపించే రీతిగా మనం చూడగలిగితే, క్రీస్తు నీతివల్ల పరిశుద్ధమైన విస్తార ప్రార్ధన ద్వారా సాధించే పని మాత్రమే ఆ తీర్పు పరీక్షకు నిలువగలదని గ్రహిస్తాం. ఆ గొప్ప పరిశీలన జరిగినప్పుడు అప్పుడు మీరు తిరిగివచ్చి, దేవుని సేవించే వ్యక్తి ఎవరో సేవించని వ్యక్తి ఎవరో గుర్తిస్తారు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 4, 1893. ChSTel 309.2
చట్టపరమైన మతం ఈ యుగానికి జవాబుదారి కాదు. మనం సేవకు సంబంధించిన బహిర్గత కార్యాలన్నీ చెయ్యవచ్చు. అయినా గిల్బోవ పర్వతాల పై మంచైనా వర్షమైనా లేనట్లు మనం చైతన్యవంతమైన పరిశుద్ధాత్మ ప్రభావం లేకుండా ఉండవచ్చు. మన హృదయాలు మృదువై లొంగటానికిగాను, మనకు ఆధ్యాత్మిక తేమ నీతిసూర్యుని కిరణాలు అవసరం. మనం నియమాలకి ఎల్లప్పుడు బండవలె స్థిరంగా నిలబడి ఉండాలి. బైబిలు నియమాల్ని బోధించటం వాటి ఒరవడిని జీవితాలు జీవించటం జరగాలి. టెస్టిమొనీస్, సం. 6, పులు. 417, 428. ChSTel 310.1
జయం శక్తి మీద సమ్మతి మీద ఆధారపడినంతగా ప్రతిభ మీద ఆధారపడదు. మనకున్న గొప్ప వరాలు అనుకూలమైన సేవ చెయ్యటానికి మనల్ని సమర్ధల్ని చెయ్యలేవు. మనల్ని సమర్ధుల్ని చేసేవి మన దినదిన విధుల్ని మనస్సాక్షితో నిర్వర్తించటం, తృప్తి చెందే స్వభావం కలిగి నివసించటం, ఇతరుల సంక్షేమం పట్ల నిరాడంబర, యధార్థ ఆసక్తి ప్రదర్శించటం. అతి సామాన్య జీవితం జీవించటంలో నిజమైన ఔన్నత్యం ఉంది. నమ్మకంగా నిర్వహించే సామాన్యమైన విధులు దేవుని దృష్టిలో అతి సందరమైనవి. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 219. ChSTel 310.2
సౌష్ఠవం, బలం, రమ్యత గల ప్రవర్తన వ్యక్తిగత విధి చర్యలతో నిర్మితమౌతుంది. మన జీవితంలోని చిన్న విషయాల్లోను పెద్ద విషయాల్లోను నిజాయితీ ప్రదర్శితమవ్వాలి. చిన్న విషయాల్లో న్యాయవర్తన, నమ్మకం గల చిన్న చిన్న కార్యాలు, దయగల చిన్న చిన్న చర్యలు జీవన మార్గాన్ని సంతోషంతో నింపుతాయి. లోకంలో పని ముగిసినప్పుడు నమ్మకంగా నిర్వర్తించిన ప్రతీ చిన్న విధి మేలుకరమైన ప్రభావాన్ని, ఎన్నడూ నశించని ప్రభావాన్ని చూపించిందని బయలుపడుతుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 574. ChSTel 310.3