స్వార్థం, లోకాశాలతో నిండిన చల్లని హృదయంలో మంచి విత్తనం గుర్తింపు లేకుండా, వేరుతన్నిందన్న నిదర్శనం లేకుండా కొంత కాలం పడి ఉండవచ్చు. కాని తర్వాత దేవుని ఆత్మ ఆత్మపై ఊదగా దాగి ఉన్న ఆ విత్తనం మొలకెత్తుతుంది. తుదకు దేవుని మహిమకు ఫలాలు ఫలిస్తుంది. మన జీవిత సేవలో ఇదో లేక అదో ఏది వర్ధిల్లుతుందో మనకు తెలియదు. ఇది మనం తీర్చాల్సిన సమస్య కాదు. మనం మన పనిని చేసి ఫలితాల్ని దేవునికి విడిచి పెట్టాలి. “ఉయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము.” “భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును... ఉండక మానవు.” ఈ వాగ్దానాన్ని విశ్వసించి వ్యవసాయదారుడు నేలదున్ని విత్తనాలు నాటతాడు. “ఆలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును నిష్పలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును.” అన్న వాగ్దానం పై అంతకన్న తక్కువ నమ్మకంతో మనం విత్తనాలు నాటే సేవలో పని చెయ్యకూడదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 65. ChSTel 311.1