దేవుని సేవ చెయ్యటంలో గడిపే సమయం నిడివిని బట్టి కాక సేవను చేసే స్పూర్తిని బట్టి దాని విలువను కొలచటం జరుగుతుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 74. ChSTel 312.4
భక్తి జీవితంలో పురోగమించటంలో వారి జయం తమకు అనుగ్రహించబడ్డ వరాల్ని వృద్ధి పర్చుకోటం పై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో వారి బహుమతి ప్రభువు సేవలో వారి విశ్వసనీయత, చిత్తశుద్ధి నిష్పత్తిలో ఉంటుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 1, 1887. ChSTel 312.5
ప్రభువుకి చేయాల్సిన పని చాలా ఉంది. ఈ జీవితంలో మిక్కిలి నమ్మకమైన మనఃపూర్వకమైన సేవ చేసిన వారికి నిత్యజీవితంలో ఆయన బహుగా సంక్రమింపజేస్తాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 330. ChSTel 312.6
ద్రాక్షతోటలో పని చెయ్యటానికి చివరి గడియలో వచ్చిన పనివారు పని చేసేందుకు అవకాశం కలిగినందుకు కృతజ్ఞులయ్యారు. తమని పనిలో పెట్టుకున్న వ్యక్తికి కృతజ్జులై ఉన్నారు. సాయంత్రం గృహయజమాని ఆ రోజంతటికి తమకు కూలి చెల్లించినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. తాము అంత కూలి సంపాదించలేదని వారికి తెలుసు. యజమాని ముఖంలో వ్యక్తమైన కనికరం వారికి ఆనందం కలిగించింది. గృహయజమాని దయాళుత్వాన్ని వారు ఎన్నడూ మరవలేదు. అతడిచ్చిన ఉదార వేతనాన్ని వారు మరవలేదు. ChSTel 313.1
పాపి విషయంలో ఇదే జరుగుతుంది. తన అయోగ్యతను గుర్తుంచుకుని పాపి ప్రభువు ద్రాక్ష తోటలో ప్రవేశిస్తాడు. తాను పొందిన ప్రతిఫలానికి తాను అయోగ్యుణ్నని గుర్తిస్తాడు. దేవుడు తనను అంగీకరించటమే గొప్ప విషయంగా భావించి ఆనందపరవశుడవుతాడు. దీన మనసు, నమ్మకమైన స్వభావంతో, క్రీస్తు తోటి పనివాడిగా పని చేసే విశేషావకాశం దొరికినందుకు కృతజ్ఞతతో నిండి ఉంటాడు. ఈ స్పూర్తిని ఘనపర్చటానికి దేవుడు ఆనందిస్తాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 387, 398. ChSTel 313.2