Go to full page →

నిశ్చిత బహుమానం ChSTel 313

ఎవని సామర్థ్యం చొప్పున వానికి “తన పనిని నియమించే ఆయన నమ్మకమైన విధి నిర్వహణకు ప్రతిఫలమివ్వకుండా విడిచి పెట్టడు. విశ్వసనీయతను విశ్వాసాన్ని కనపర్చే ప్రతీ చర్య దేవుని ప్రసన్నతను మెచ్చుకోలును పొందుతుంది. “పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.” టెస్టిమొనీస్, సం. 5, పు. 395. ChSTel 313.3

మన సేవాకాలం కొంచెమే అయినా లేక మనం చేసే సేవ స్వల్పమయ్యిందే అయినా మనం సామాన్య విశ్వాసంతో క్రీస్తుని వెంబడిస్తే బహుమానం విషయంలో నిరాశ చెందాల్సిన పనిలేదు. మిక్కిలి గొప్పవారు, వివేకవంతులు సంపాదించలేనిది మిక్కిలి బలహీనులు మిక్కిలి సామాన్యులు పొందవచ్చు. పరలోక సువర్ణ ద్వారం ఆత్మస్తుతి ప్రియుడికి తెవబడదు. గర్విష్టుడికి అది తెరుచుకోదు. అయితే ఆ నిత్యద్వారాలు చిన్నపిల్ల వాడి బలహీన స్పర్శకు తెరుచుకుంటాయి. సామాన్య విశ్వాసంతోను ప్రేమతోను దేవునికి సేవ చేసేవారికి కలిగే కృపా బహుమానం ధన్యమైంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 404. ChSTel 313.4

ఈ సేవ చేసేవారి శిరాలు త్యాగ కిరీటాలు ధరిస్తాయి. వారు తమ బహుమానాన్ని అందుకుంటారు. టెస్టిమొనీస్, సం. 6, పు. 348. ChSTel 314.1

దైవ సేవ చేసే ప్రతీ పనివాడికి ఈ ఆలోచన ప్రేరణని ఉద్రేకాన్ని అందించాలి. ఈ జీవితంలో మనం దేవునికి చేసే పని తరచు దాదాపు నిష్పలంగా కనిపిస్తుంది. మేలు చెయ్యటానికి మన ప్రయత్నాలు పట్టుదల చిత్తశుద్దితో కూడినవే కావచ్చు. అయినా వాటి ఫలితాల్ని మనం చూడటానికి లేకపోవచ్చు. ఆ ప్రయాస మనకు వ్యర్థంగా కనిపించవచ్చు. కాని మన పనిని పరలోకం గుర్తిస్తుందని, దానికి బహుమానం తప్పక లభిస్తుందని రక్షకుడు భరోసా ఇస్తున్నాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 305. ChSTel 314.2

ప్రతీ క్రియ, న్యాయమైన, దయగల ప్రతీ చర్య, ఔదార్యం కల ప్రతీ కార్యం పరలోకానికి సంగీతంలా ఉంటుంది. వాటిని చేసే వారిని తండ్రి తన సింహాసనం నుంచి వీక్షించి వారిని తన స్వకీయ ధనంలోని వారిగా లెక్కిస్తాడు. ఆయన “నేను నియమింపబోవు దినమురాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు” అంటున్నాడు. లేమిలో ఉన్నవారికి లేక బాధ అనుభవిస్తున్న వారికి చేసే ప్రతీ దయాకార్యం యేసుకి చేసినట్లే అవుతుంది. పేదలకి బాధితులకి, హింసించబడుతున్న వారికి సానుభూతి ఎవరు చూపిస్తారో, అనాధలకు ఎవరు స్నేహహస్తం అందిస్తారో అతడు యేసుతో దగ్గర సంబంధాన్ని ఏర్పర్చుకుంటాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 16, 1881. ChSTel 314.3

దురదృష్టవంతులకి, అంధులకి, కుంటివారికి, రోగులకి, విధవరాండ్రకి, అనాధలకి చేసే కృపా కార్యాలు, ఔదార్యం, సమయోచితమై పరిగణనతో కూడిన చర్యలన్నింటిని తనకు చేసినవాటిగా క్రీస్తు పరిగణిస్తాడు. ఈ క్రియలు పరలోక గ్రంథాల్లో దాఖలవుతాయి. కర్తలు బహుమానం పొందుతారు. టెస్టిమొనీస్, సం. 3, పులు. 512, 513. ChSTel 314.4