సంఘ పుస్తకాల్లో నమోదైన పేరుల్లో ఇరవై మందిలో ఒకరుకూడా తమ లోక చరిత్ర ముగించటానికి సిద్ధంగా లేరని, దేవుడు లేకుండా, సామాన్య పాపిలా నిరీక్షణ లేకుండా లోకంలో ఉంటారని నేనన్న మాటలు గంభీరమైన మాటలు, వారు దేవుని సేవ నామకార్ధంగా చేస్తారు. కాని వాస్తవంగా వారు డబ్బుకి ఊడిగం చేస్తారు. సగం దేవునికి సగం డబ్బుకి చేసే సేవ క్రీస్తుని విశ్వసించటం కన్నా ఆయన్ని ఎరగమని ప్రతినిత్యం బొంకటమౌతుంది. అనేకులు లోబడని తమ స్వభావాన్ని సంస్కరించకుండా సంఘంలోకి తీసుకువస్తారు. తమ సొంత అనైతికమైన, నీచమైన భ్రష్టత వారి ఆధ్యాత్మిక అభిరుచిని వక్రీకరిస్తుంది. వారు స్వభావంలోను, హృదయంలోను, ఉద్దేశంలోను లోకానికి ప్రతీకగా ఉంటారు. శరీరాశలు క్రియల విషయంలో లోకాన్ని అనుసరిస్తారు. వారి నామకార్థపు క్రైస్తవ జీవితం వంచనతోను మోసంతోను నిండి ఉంటుంది. పాప జీవితాలు జీవిస్తూ క్రైస్తవులమని చెప్పుకోటం! క్రైస్తవ నామం ధరించి క్రీస్తును రక్షకునిగా ఒప్పుకునేవారు వారి మధ్యనుంచి బయటికి రావాలి. వారు అపవిత్రమైనదాన్ని ముట్టకూడదు. ప్రత్యేకంగా ఉండాలి.... ChSTel 41.2
భక్తివిడిచి ఎండిపోయిన ఎముకలవంటివారైన తన ప్రజలు జీవించేందుకు నా కలాన్ని పక్కనబెట్టి, నా ఆత్మను ఎత్తి ప్రభువు పొత్మను ఊదవలసిందిగా ప్రార్థన చేస్తాను. అంతం సమీపంలో ఉంది. నిద్రించేవారు సిద్దంగా లేనప్పుడు కనబడకుండా, నిశ్శబ్దంగా, చడీచప్పుడు లేకుండా అడుగులు వేస్తూ రాత్రిలో వచ్చే దొంగలా ఆ దినం మన మీదికి వస్తుంది. ఇప్పుడు సుఖంగా ఉన్న ఆత్మలు ఇతరుల్లా ఇక నిద్రపోకుండా మెలకువగాను, స్వస్తబుద్ధితోను ఉండేందుకు ప్రభువు తన ఆత్మను పంపునుగాక. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1893, పులు. 132, 133. ChSTel 41.3