Go to full page →

పునరుజ్జీవనం, దిద్దుబాటు అగత్యం ChSTel 42

త్వరలో లోకం మీదికి గొప్ప ఆశ్చర్యంగా రానున్నదాని కోసం క్రైస్తవులు సిద్దపడాలి. దైవవాక్యాన్ని అధ్యయనం చెయ్యటం ద్వారా, వాక్య నియమాలననుసరించటానికి పూనుకోటం ద్వారా వారు సిద్దపడాల్సి ఉంది. దేవుడు పునరుజ్జీవనానికి దిద్దుబాటుకి పిలుపునిస్తున్నాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 626. ChSTel 42.1

మనలో నిజమైన దైవభక్తి పునరుజ్జీవనం మన అవసరాలన్నిటిలోను అతిగొప్పది, అత్యవసరమైంది. దీన్ని అన్వేషించటం మన ప్రథమ కర్తవ్యం. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 22, 1887. ChSTel 42.2

సంపూర్ణ సంస్కరణ నిర్వహించటానికి సమయం వచ్చింది. ఈ సంస్కరణ ప్రారంభమైనప్పుడు ప్రార్థనా స్వభావం ప్రతీ విశ్వాసిని క్రియాశీలంచేసి సంఘంలోని విభేదాలను అనైక్యతను బహిష్కరిస్తుంది. టెస్టిమొనీస్, సం.8, పు. 251. ChSTel 42.3

పరిశుద్దాత్మ పరిచర్య కింద పునరుజ్జీవనం, సంస్కరణ చోటు చేసుకోవాలి. పునరుజ్జీవనం సంస్కరణ రెండూ వేర్వేరు విషయాలు. పునరుజ్జీవనం ఆధ్యాత్మిక జీవన నవీకరణను, మానసిక, అంతరంగిక శక్తులు క్రియాత్మకం కావటాన్ని, ఆధ్యాత్మిక మరణంనుంచి పునరుత్థానాన్ని సూచిస్తుంది. సంస్కరణ అభిప్రాయాలు, సిద్ధాంతాలు, అలవాట్లు, అభ్యాసాల పునర్వ్యవస్థీకరణను మార్పును సూచిస్తుంది. సంస్కరణ పరిశుద్దాత్మ పునరుజ్జీవనంతో అనుసంధానపడకపోతే అది నీతి అనే సత్సలాన్ని ఉత్తతి చెయ్యలేదు. పునరుజ్జీవనం సంస్కరణ వాటి నియమిత పనిని నిర్వహించాలి. ఇది చెయ్యటంలో అవి ఒకదానితో ఒకటి కలవాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర 25,1902. ChSTel 42.4

ఇంకా పవిత్రం పరిశుద్దం అయిన పనిని మనం చెయ్యాలని లేఖనాలు ఉద్బోధించటంలేదా?... పరిశుద్దాత్మ నియంత్రణను అంగీకరించటానికి సమ్మతంగా ఉన్నవారిని సంపూర్ణ సంస్కరణ కృషిలో నాయకత్వం వహించటానికి దేవుడు పిలుస్తున్నాడు. మన ముందు ఓ క్లిష్ట పరిస్థితి ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. తన పనివారు తమ పాత్ర నిర్వహించాల్సిందిగా ప్రభువు పిలుపునిస్తున్నాడు. ప్రతీవారు గడిచిన సంవత్సరాల్లోకన్నా ఇప్పుడు మరింత గాఢంగా యదార్ధంగా దేవునికి ప్రతిష్టించుకునే స్థితిలో నిలవాలి..ఇటీవలి కాలంలో రాత్రి దర్శనంలో నేను చూసిన దృశ్యాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అనేక స్థలాల్లో గొప్ప ఉద్యమం - పునరుజ్జీవన కృషి - సాగుతున్నట్లు కనిపించింది. దేవుని పిలుపుకు స్పందిస్తూ మన ప్రజలు తమ నియమిత స్థానాల్లోకి కదలుతున్నారు. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, మే 29, 1913, పు. 34. ChSTel 42.5

దైవ ప్రజల మధ్య గొప్ప సంస్కరణోద్యమం సాగుతున్న దృశ్యాలు రాత్రి దర్శనాల్లో నాముందు నుంచి కదలివెళ్లాయి. అనేకులు దేవుని స్తుతిస్తున్నారు. రోగులు స్వస్తత పొందటం వంటి అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి.... వందలు వేలమంది కుటుంబాల్ని సందర్శించి, వారికి దైవవాక్యాన్ని తెరవటం కనిపించింది. పరిశుద్ధాత్మ శక్తి మూలంగా హృదయాలు మారాయి. యధార్థమైన మారుమనసు కనిపించింది. సత్యం ప్రకటించేందుకు అన్ని పక్కలా తలుపులు తెరుచుకున్నాయి. పరలోక ప్రభావంతో లోకమంతా వెలిగిపోయినట్లు కనిపించింది. నిజాయితీ పరులు దీనులు అయిన దైవప్రజలు గొప్ప ఆశీర్వాదాలు పొందారు. టెస్టిమొనీస్, సం.9, పు. 126. ChSTel 43.1

దైవ ప్రజల నడుమ సంస్కరణ అవసరం ఎంతైనా ఉంది. సంఘం ప్రస్తుత పరిస్థితి దుర్నీతికి దారితీస్తుంది. మనకోసం తన ప్రాణాన్నిచ్చిన ఆ ప్రభువుని ఇది నిర్దుష్టంగా సూచిస్తుందా? టెస్టిమొనీస్, సం.3, పు. 474. ChSTel 43.2

సంఘం సోమరితనం నిందను తొలగించుకున్నప్పుడు, ప్రభువు ఆత్మ ప్రదర్శితమౌతుంది. దేవుని శక్తి వెల్లడవుతుంది. సైన్యాలకు అధిపతి అయిన యెహోవాశక్తి పనిచెయ్యటం సంఘం చూస్తుంది. సత్యం స్పష్టంగా బలమైన కిరణాలతో ప్రకాశిస్తుంది. అపొస్తలుల కాలంలోలాగ అనేకులు అసత్యం విడిచి పెట్టి సత్యాన్ని అంగీకరిస్తారు. లోకమంతా ప్రభువు మహిమతో వెలిగిపోతుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 46. ChSTel 43.3