Go to full page →

విశ్వాసానికి సరియైన కారణం ఇవ్వలేకపోవటం ChSTel 47

ఈ చివరి దినాలకి దేవుని సత్యాన్ని విశ్వసిస్తున్నట్లు చెప్పే అనేకమంది కొదువగా ఉన్నట్లు నిరూపించుకుంటారు. వారు ప్రాముఖ్యమైన విషయాల్ని అలక్ష్యం చేశారు. వారిది పైపై మారుమనసే. అది లోతైంది, నిజమయ్యింది, సంపూర్ణమయ్యింది కాదు. తాము సత్యాన్ని ఎందుకు విశ్వసిస్తున్నారో వారికే తెలియదు. ఇతరులు విశ్వసిస్తున్నారు కాబట్టి దాన్ని సత్యంగా పరిగణించి వారూ విశ్వసిస్తారు. తాము ఎందుకు నమ్ముతున్నా మన దానికి వారు సరియైన కారణం చెప్పలేరు... తమ అనుభవం వల్లగాని జ్ఞానంవల్లగాని ఇతరులికి వికాసంగాని జ్ఞానంగాని కలుగదు. అది పొందటం వారి ఆధిక్యతేకాదు విధికూడా. యధార్ద హృదయులైన విశ్వాసులు బలంగాను స్థిరంగాను ఉంటారు. టెస్టిమొనీస్, సం.2, పు. 634. ChSTel 47.1