Go to full page →

ఆధ్యాత్మిక అంధకారం ChSTel 59

లోక సంఘాల్లో ఇది ఆధ్యాత్మిక అంధకార సమయం. దైవ సంగతులను గూర్చిన అజ్ఞానం దేవున్ని సత్యాన్ని కనపడకుండా చేస్తుంది. దుష్టశక్తులు బలంపుంజుకుంటున్నాయి. తాను లోకం దృష్టిని ఆకర్షించే గొప్ప పనిని చేస్తానని సాతాను తన తోటి పనివారిని ఉత్సాహపర్చి పొగడ్తున్నాడు. సంఘం పాక్షికంగా సోమరి కావటం, సాతాను అతడి అనుచరగణం క్రియాశీలం కావటం జరుగుతున్నది. క్రైస్తవ నామం ధరించిన సంఘాలు లోకానికి మారుమనసు కలిగించటం లేదు. ఎందుకంటే అవి స్వార్ధం, గర్వంతో భ్రష్టమయ్యాయి. ఇతరుల్ని పవిత్రమైన, ఉన్నతమైన ప్రమాణానికి నడిపించకముందు మార్పు కలిగించే దైవశక్తి తమ మధ్య ఉండటం వాటి గొప్ప అవసరం. టెస్టిమొనీస్, సం.9, పు. 65. ChSTel 59.4

పూర్వంలోలా ఈ దినాల్లోనూ దైవ వాక్యంలోని ముఖ్యసత్యాల్ని తోసిరాజని, మానవ సిద్ధాంతాలు ఊహాగానాల్ని వివ్వసించటం జరుగుతున్నది. సువార్త పరిచారకులుగా చెప్పుకునే పలువురు మొత్తం బైబిలుని దైవావేశ పూరిత వాక్యంగా అంగీకరించరు. ఒక జ్ఞాని ఓ వాక్యభాగాన్ని తోసి పుచ్చితే ఇంకోఘనుడు మరో భాగాన్ని ప్రశ్నిస్తాడు. తమ ఆలోచన వాక్యంకన్నా గొప్పదని వారి భావన కనుక వారు బోధించే లేఖనానికి తమ మాటే ప్రామాణికం. దాని దైవాధికారం నాశనమౌతుంది. ఈ రకంగా అవిశ్వాస విత్తనాల్ని వెదజల్లటం జరుగుతుంది. ప్రజలు ఏది నమ్మాలో తెలియక తికమకపడ్డారు. మనసుకి ఆలోచించే హక్కులేని నమ్మకాలు చాలా ఉంటాయి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 39. ChSTel 60.1

దుర్మార్గత పరాకాష్ఠనందుకుంటుంది. అయినా అనేకమంది సువార్త పరిచారుకులు “శాంతి సంక్షేమం” అంటూ కేకలు వేస్తున్నారు. కాగా నమ్మకమైన దైవ సేవకులు తమ పనిచేసుకుంటూ ముందుకిపోవాలి. పరలోక సర్వాంగ కవచం ధరించి, ఈ కాలానికి దేవుడు నిర్దేశించిన సత్యవర్తమానాన్ని తమ అందుబాటులో ఉన్న ప్రతీ ఆత్మకు అందించేవరకూ ఎన్నడూ ఆగకుండా నిర్భయంగా, విజయవంతంగా తమ పోరాటాన్ని సాగించాలి. ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 220. ChSTel 60.2

నేటి మత ప్రపంచంలోని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటానికి హేతువుంది. దేవుని కృపను చులకనగా చూడటం జరుగుతున్నది. “మానవుల ఆజ్ఞల్ని సిద్దాంతాలుగా బోధిస్తూ” వేలాది ప్రజలు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నారు. మన దేవంలో అనేక సంఘాల్లో అవిశ్వాసం విస్తరిస్తున్నది. అది బైబిలుని బాహాటంగా నిరాకరించే అవిశ్వాసం కాదు. కాని క్రైస్తవం దుస్తులు ధరించి, బైబిలు దైవావేశం వల్ల వచ్చిన గ్రంథమని నమ్మని అవిశ్వాసం. ప్రగాఢ భక్తి, దైవచింతన స్థానాన్ని ఆచారం సంప్రదాయం ఆక్రమిస్తున్నాయి. ఫలితంగా, మతభ్రష్టత, శరీరాశలు ప్రబలమౌతున్నాయి. క్రీస్తన్నాడు, “లోతుదినములలో జరిగినట్లును జరుగును...) దినదినం చోటు చేసుకుంటున్న ఘటనల దాఖలా ఈ మాటల నెరవేర్పును ధ్రువపర్చుతుంది. లోకం నాశనానికి వేగంగా పక్వమౌతున్నది. త్వరలో దేవుని తీర్పులు ప్రకటితం కానున్నాయి. పాపం, పాపులు అగ్నిచే దహించబడ్డారు. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 166. ChSTel 60.3