Go to full page →

గురుగుల నుంచి గోధుమల్ని వేరు చెయ్యటం ChSTel 61

దేవుని నాశనకరమైన తీర్పుల సమయం సత్యం తెలుసుకోటానికి అవకాశం లేకుండా ఉన్న వారికి కృపకాలం. దేవుడు వారిపట్ల దయ కలిగి ఉంటాడు. ఆయన కృపా హృదయం చలిస్తుంది. ప్రవేశించటానికి ఇష్టపడని వారికి తలుపును మూసివేస్తూ రక్షించటానికి ఆయన హస్తం చాచి ఉంటుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 97. ChSTel 61.1

దేవుని సేవించేవారికి సేవించనివారికి మధ్య త్వరలో తీవ్ర పోటాటం సాగుతుంది. కదల్చలేనివి మిగిలి ఉండేందుకు కదల్చబడగలిగేదంతా కదల్చబడుతుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 15, 16. ChSTel 61.2

జాతులకు ఆపద ఆందోళన సమయంలో సాతాను దుష్ప్రభావాలకు సాతాను సేవకు తమను తాము పూర్తిగా అప్పగించకోకుండా ఉండేవారు, దేవునిముందు తమను తాము తగ్గించుకుని ఆయన అంగీకారం క్షమాపణ కోసం పూర్ణహృదయంతో ఆయన తట్టు తిరిగేవారు అనేకులుంటారు. టెస్టిమొనీస్, సం.1, పు. 269. ChSTel 61.3

లేఖనాల్ని పఠించేవారు వాటి యధార్ధ భావాన్ని గ్రహించలేనివారు చాలా మంది ఉన్నారు. లోకమంతటా పురుషులు స్త్రీలు ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. వెలుగుకోసం, కృపకోసం, పరిశుద్దాత్మకోసం ప్రార్థనలు, కన్నీరు, విచారణలు పైకి వెళ్తాయి. అనేకులు లోపలికి పోగుచెయ్యబడటానికి దేవుని రాజ్యం అంచున వేచిఉన్నారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజిల్స్ పు. 109. ChSTel 61.4