వాక్యపరిచారకులు స్వచ్చంద బోధకులు పండుతున్న పొలాల్లోకి ప్రవేశించాలి. మర్చిపోయిన బైబిలు సత్యాల్ని వారెక్కడ బోదిస్తారో అక్కడ వారికి పంట కనిపిస్తుంది. సత్యాన్ని అంగీకరించి క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటానికి తమను తాము అంకితం చేసుకునే వారిని వారు కనుగొంటారు. సైన్స్ ఆఫ్ ది టైమ్స్, ఆగ. 3, 1903. ChSTel 75.1
సత్యవిత్తనాలు వెదజల్లటంలో ఎక్కువ భాగం పనిని వాక్య పరిచారకులే చెయ్యాలని ప్రభువు ఉద్దేవించటంలేదు. వాక్యపరిచర్యకు పిలువబడనివారిని తమ శక్తిసామర్థ్యాల మేరకు ప్రభువు సేవ చెయ్యటానికి ప్రోత్సహించాలి. ఇప్పుడు సోమరులుగా ఉన్న వందల పురుషులు స్త్రీలు యోగ్యమైన సేవ చెయ్యగలుగుతారు. తమ మిత్రులు ఇరుగు పొరుగువారి గృహాల్లోకి సత్యాన్ని తీసుకువెళ్లటం ద్వారా, ప్రభువుకి వారు గొప్ప సేవ చెయ్యవచ్చు. టెస్టిమొనీస్, సం. 7, పు. 21. ChSTel 75.2
తన వాక్యపరిచారకులు ప్రకటించటానికి దేవుడు సత్య వర్తమానాన్నిచ్చాడు. వెలుగు తాలూకు మొదటి కిరణాల్ని పట్టుకుని వెదజల్లటానికి వాటిని సంఘాలు స్వీకరించి ఇతరులికి అందిచటానికి అన్ని విధాల కృషి చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 6, పు. 125. ChSTel 75.3
వాక్యపరిచారకుడు ఎక్కడ ఉద్దరణ సేవ చేస్తాడో అక్కడ ప్రజలు ఉద్దరణ సేవ చేస్తూ అతని కృషికి మద్దతు ఇస్తూ అతడు తన భారాల్ని మోయటానికి సహాయపడాలి. అప్పుడు అతడి పని భారం ఎక్కువవ్వదు. అతడు అధైర్యం చెందడు. సేవ పురోభివృద్ధికి ప్రజలు ముందుకు వచ్చి తాము చెయ్యగలిగినదంతా జ్ఞానయుక్తంగా, నియమబద్ధంగా చెయ్యకపోతే సంఘం ముందుకి సాగటానికి దాన్ని ప్రభావితం చెయ్యగల శక్తి ఏదీలేదు. రివ్యూ అండ్ హెరాల్డ్ ఆగ, 23, 1881. ChSTel 75.4