Go to full page →

అధ్యాయం-9
మేల్కొలుపు పిలుపు ChSTel 86

ఆదేశం ChSTel 86

సువార్త సందేశం సార్వత్రిక చర్యకు ఆదేశిస్తూ మన సంఘాల్లో మారుమోగాలి. సంఘసభ్యులు తమ అదృశ్యపరలోక మిత్రుల నుంచి ఉత్సాహం పొందుతూ, తమ అనంత వనరులనుంచి తాము పొందిన జ్ఞానం, తాము నిమగ్నమై ఉన్న సేవ గొప్పతనం తమ అధినాయకుని శక్తి ఆధారంగా తమ విశ్వాసాన్ని వృద్ధిపరుచకోవాలి. మార్గదర్శనం కోసం దేవుని నియంత్రణకు తమను సమర్పించుకునేవారు జరగటానికి సిద్దంగా ఉన్న ఘటనల స్థిర గమనాన్ని గుర్తిస్తారు. లోకం జీవించటానికి గాను ఎవరు తన ప్రాణం అర్పించారో ఆ ప్రభువు ఆత్మావేశం వల్లవారు తాము చేయలేని పనిని చూపిస్తూ శక్తిహీనంగా నిలిచిపోరు. తమకు ఏది అవసరమౌతుందో దాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు సరఫరా చేస్తాడన్న స్పృహతో పరలోక కవచాన్ని ధరించి దేవుని కోసం కార్యాలు చెయ్యటానికి, సాహసించటానికి వారు పోరాటానికి బయలుదేరి వెళ్లారు. టెస్టిమొనీస్, సం.7, పు. 14. ChSTel 86.1

మనం మేల్కోవాలి! పోరాటం సాగుతుంది. సత్యం అసత్యం వాటి తుది సంఘర్షణకు చేరుకున్నాయి. ఇమ్మానుయేలు యువరాజు రక్తసిక్త ధ్వజం కింద విశ్వాసపోరాటం పోరాడి నిత్యగౌరవాన్ని సంపాదించటానికి మనం ముందుకి సాగుదాం. ఎందుకంటే సత్యం జయిస్తుంది. మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రభువు ద్వారా మనం అత్యధిక విజయులం కాగలం. కృపకాలం విలువైన గడియలు ముగిసిపోతున్నాయి. మన పరలోకపు తండ్రిని మహిమపర్చుతూ క్రీస్తు ఏ ఆత్మల కోసం మరణించాడో వారిని రక్షించే సాధనాలుగా ఉండేందుకు మన నిత్య జీవాన్ని స్థిరపర్చుకోటానికి పనిచేద్దాం. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 86.2