అన్యుల మధ్య మిషనెరీ సేవ విజయం సాధ్యాసాధ్యాల్ని చర్చిస్తున్న ఓ క్రైస్తవ సమావేశం జరుగుతున్న చోట ఓసారి వెల్లింగ్టన్ డ్యూక్ ఉన్నాడు. అలాంటి ప్రయత్నాలు ఖర్చుకు తగ్గ ప్రయత్నంగా తేలుతుందా అన్న అంశం పై సభవారు వెల్లింగ్టన్ అభిప్రాయం కోరారు. వృద్దుడైన ఆ సైనికుడన్నాడు, “మా మార్చింగ్ ఉత్తర్వులు ఏమిటి? జయం మీరు చర్చించాల్సిన విషయం కాదు. మా మార్చింగ్ ఆజ్ఞను నేను సరిగా గ్రహిస్తే అది ఇలా ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి” పెద్ద మనుషులారా, మీ మార్చింగ్ ఆజ్ఞను సిరసావహించండి” అన్నాడు. గాసిపుల్ వర్కర్స్ పు. 115. ChSTel 87.1