క్రీస్తు ప్రతీ సైనికుడు తన విధిని నెరవేర్చి ఉంటే, సీయోను గోడల పై పహారా కాస్తున్న ప్రతీ కావలివాడు ఖచ్చితమైన బూరధ్వని చేసి ఉంటే, హెచ్చరికా వర్తమానాన్ని లోకం ఇంతకు ముందు ఎప్పుడో వవినడం జరిగి ఉండేది. కాని పని ఎన్నో సంవత్సరాలు వెనకబడి ఉంది. మనుషులు నిద్రపోతుండగా సాతాను మనల్ని దెబ్బ తీస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 29. ChSTel 97.3
మనకు నియమితమైన పనిని ఇప్పుడు మనం చేపట్టి, తమ ముందున్న ప్రమాదానికి పురుషుల్ని స్త్రీలని మేల్కొల్పే వర్తమానాన్ని ప్రకటింద్దాం. ప్రతీ సెవెంతు డె ఎడ్వెంటిస్టు తనకు నియమిత్తమైన పనిని చేసి ఉంటే విశ్వాసుల సంఖ్య ఇప్పటికన్నా మరెంతో ఎక్కువగా ఉండేది. వర్తమానాన్ని శ్రద్ధగా విని, దైవ ధర్మశాస్త్రానికి విధేయులై నివసించటానికి ఇష్టపడేవారు అమెరికా నగరాలన్నింటిలోను ఉండేవారు. టెస్టిమొనీస్, సం9, పు. 25. ChSTel 97.4
తన ప్రజలు లోకానికి కృపావర్తమానాన్ని అందించటం ద్వారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుతున్నట్లయితే, క్రీస్తు ఇంతకు ముందెన్నడో లోకానికి వచ్చి ఉండేవాడు. పరిశుద్దులు దేవుని పరిశుద్ద పట్టణంలోకి ఆహ్వానాన్ని పొంది ఉండేవారు. టెస్టిమొనీస్, సం. 6, పు. 450. ChSTel 98.1