ప్రవర్తనలు కొలవటం నిత్యం సాగుతున్నది. మీ నైతిక విలువను దేవుని దూతలు బేరీజు వేసి, మీ అవసరాల్ని నిర్ధరించి, మీ కేసుతో దేవుని వద్దకు వెళ్లారు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఏప్రి. 2, 1889. ChSTel 97.1
మనం చెయ్యగలిగిన దానికి ఏ కొంచెం తక్కువైనా మనం వ్యక్తిపరంగా బాధ్యులమౌతాం. సేవ చెయ్యటానికి గల ప్రతీ సాధ్యాన్ని ప్రభువు నిక్కచ్చిగా కొలుస్తాడు. ఉపయోగించే తరుణాల్ని లెక్కలోకి తీసుకునేటట్లే ఉపయోగించకుండా విడిచి పెట్టే తరుణాల్ని లెక్కలోకి తీసుకుంటాడు. మన సమర్థతల సక్రమ వినియోగం ద్వారా మనం సాధించాల్సిన ప్రగతికి దేవుడు మనల్ని బాధ్యుల్ని చేస్తాడు. దేవున్ని మహిమ పర్చటానికి మన శక్తుల్ని ఉపయోగించనందువల్ల మనం చెయ్యాల్సింది చెయ్యుని దాన్ని బట్టి తీర్పు పొందుతాం. మన ఆత్మల్ని పోగొట్టుకోకపోయినా, మనం ఉపయోగించకుండా ఉంచిన వరాల పర్యసానాన్ని నిత్యకాలం పొడుగునా గుర్తిస్తాం. సంపాదించగలిగి ఉండి సంపాదించని జ్ఞానానికి, సామర్థ్యానికి నిత్యమైన నష్టం ఉంటుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 363. ChSTel 97.2