కార్యకలాపాలు పెరిగి మనం చేయాల్సిన పనిని చెయ్యటంలో జయం పొందే కొద్దీ మానవ ప్రణాళికల్ని పద్దతుల్ని నమ్ముకునే ప్రమాదం ఉందని మనం మర్చిపోకూడదు. ప్రార్ధించటం విశ్వసించటం తగ్గే అవకాశం ఉంది. మన పనిని జయప్రదం చెయ్యగల దేవుని పై ఆధారపడాలన్న స్పృహను కోల్పోయే ప్రమాదంలో ఉంటాం. మన ప్రవృత్తి ఇది అయినా, మానవ ప్రతినిధి చెయ్యాల్సింది తక్కువ అని ఎవరూ తలంచకూడదు. మానవుడు తక్కువ చేయాల్సినవాడు కాదు. పరలోకవరమైన పరిశుద్దాత్మను స్వీకరించటం ద్వారా అతడు ఎక్కువ సాధించాల్సి ఉంది. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 4, 1893. ChSTel 111.3
దైవశక్తి సంఘాన్ని కుదిపివేసే సమయాలుంటాయి. ఫలితంగా సంఘం క్రియాశీలమౌతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ తాలూకు ప్రాణ దాయక శక్తి సభ్యులు వెళ్లి క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటానికి వారిని ఆవేశపర్చుతుంది. కాని ఇది ప్రదర్శితమైనప్పుడు అతినమ్మకమైన పనివారు ఎడతెగని ప్రార్థన ద్వారా దేవుని పై ఆధారపడితేనే క్షేమంగా ఉండగలరు. తమ సేవ విషయంలో క్రీస్తు కృపద్వారా అతిశయపడుకుండేందుకు లేక తమ కార్యకలాపాల్నే రక్షకుడిగా చేసుకోకుండేందుకు వారు చిత్తశుద్ధితో ప్రార్థించాల్సి ఉంది. కార్యసాధన ఆయన శక్తి ద్వారానే జరుగుతున్నదని తాము గుర్తుంచుకునేందుకు, ఆ విధంగా మహిమ అంతటినీ దేవునికి చెల్లించేందుకు వారు నిత్యం యేసు పై తమ దృష్టి నిలపాల్సి ఉంది. దేవుని సేవా వ్యాప్తికి మనం మిక్కిలి నిర్ణయాత్మక కృషి చేయాల్సి ఉంటుంది. మన పరలోకపు తండ్రికి ప్రార్ధించటం అత్యవసరం. మన రహస్య ప్రారన స్థలంలో, కుటుంబంలో, సంఘంలో ప్రార్థనలో సమయం గడపటం ఎంతో అవసరం. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 4, 1893. ChSTel 112.1
రబ్బీల ఆలోచన ప్రకారం నిత్యం హడావుడిగా సందడిగా సాగే కార్యకలాపాల సమాహారమే మతం, తమ ఉత్తమ శ్రేణి భక్తిని కనపర్చుకోటానికి వారు ఏదో బాహ్యచర్య మీద ఆధారపడేవారు. ఈ రకంగా వారు తమ ఆత్మల్ని దేవుని నుంచి వేరుచేసి, తమను తాము ఆత్మ సమృద్దతతో నింపుకున్నారు. ఈ ప్రమాదాలే ఇంకా ఉన్నాయి. కార్యకలాపాలు పెరిగి మనుషులు దేవునికి ఏ పని చెయ్యటంలోనైనా విజయం సాధించే కొద్దీ మానవ ప్రణాళికల్ని పద్ధతుల్ని నమ్ముకునే ప్రమాదముంది. ప్రార్ధించటం తక్కువవుతుంది, విశ్వాసం తక్కువవుతుంది. శిష్యుల్లా, దేవుని మీద ఆధారపడటం విస్మరించి, మన కార్యక్రమాలు కార్యకలాపాల్నే రక్షకుణ్ణి చేసుకునే ప్రమాదంలో మన మున్నాం. మనం నిత్యం క్రీస్తు పై దృష్టినిలిపి, కార్యాలు సాధించేది ఆయన శక్తేనని గుర్తించాల్సిన అవసరం ఉంది. పాపంలో నశిస్తున్నవారి రక్షణకోసం మనం దీక్షతో కృషిచెయ్యాల్సిఉండగా, ధ్యానంలోను, ప్రార్ధనలోను, దైవవాక్యపఠనంలోను మనం సమయం గడపాలి. ఎక్కువ ప్రార్థనతోచేసిన, క్రీస్తు నీతి వలన ప్రతిష్టితమైన, పనిమాత్రమే మేలు చెయ్యటానికి ఉపయుక్తమౌతుందని చివరికి నిరూపితమౌతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 362. ChSTel 112.2