దేవుని సేవలోచిన్నచిన్న పనులు సంతోషంగా చేపట్టి పనిచేసేవారే విజయాలు సాధించే సేవకులు. నమూనాని పూర్తి చెయ్యటంలో తోడ్పడటానికి ప్రతీవ్యక్తి తన జీవితపు నూలుతో వస్త్రంలో తన వంతు నేత నెయ్యా లి. టెస్టిమొనీస్, సం. 6, పు. 115. ChSTel 113.1
మన సేవను నిత్యత్వం వెలుగులో చూస్తున్నాం గనుక మనం ప్రయోజకత్వంలో నిత్యం వృద్ధి చెందుతూ, మన దినవారీ విధుల్ని భక్తి కార్యాలుగా దిద్దుకోవాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 150. ChSTel 113.2
తన ప్రణాళికలో ప్రభువు ప్రతీ వ్యక్తికీ ఓ స్థానాన్ని ఏర్పాటు చేశాడు. అవసరంలేని వరాల్ని ఆయన ఇవ్వడు. టెస్టిమొనీస్, సం.9, పు. 37. ChSTel 113.3
పరలోక నిత్యప్రణాళికలో ప్రతీ వ్యక్తికీ ఓ స్థానముంది. ప్రతీ వ్యక్తి ఆత్మల రక్షణ సేవలో క్రీస్తుతో సహకరిస్తూ పనిచెయ్యాలి. పరలోక భవంతుల్లో మనకు ప్రభువు ఓ నివాసం ఏర్పాటు చెయ్యటం ఎంత నిశ్చితమో, ఈ లోకంలో మనం దేవునికి చెయ్యటానికి ఓ ప్రత్యేక సేవా స్థానాన్ని మనకు ఏర్పాటు చెయ్యటమూ అంతే నిశ్చితం. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు 326, 327. ChSTel 113.4
ప్రభువు దృష్టి తన ప్రజలందరి మీద ఉంది. ప్రతీ వ్యక్తి విషయంలో ఆయనకు తన ప్రణాళికలున్నాయి. టెస్టిమొనీస్, సం.6, పు.12 ChSTel 113.5
అందరూ దైవసేవలో ఏదో కొంత చెయ్యవచ్చు. ఆత్మల రక్షణ కృషిలో చిత్తశుద్ధితో స్వార్థరహితంగా పనిచెయ్యకపోతే దేవుని ముందు ఎవరూ నిర్దోషులుగా నిలబడరు. టెస్టిమొనీస్, సం.5, పు. 395. ChSTel 113.6
మీ విధిని వేరొకరికి బదలాయించటం సాధ్యపడదు. మీ పనిని మీరు తప్ప ఇంకెవ్వరూ చెయ్యకూడదు. మీరు వెలుగును అట్టిపెట్టుకుంటే మి నిర్లక్ష్యంవల్ల ఎవరో చీకటిలో మిగిలిపోవచ్చు. టెస్టిమీనీస్, సం. 5, పు. 464. ChSTel 114.1
దేవుని పిలుపుకు విధేయతతో స్పందించే దీన సేవకుడు దేవుని సహాయాన్ని పొందుతానన్న నిశ్చయతను కలిగి ఉండవచ్చు. అంతగొప్ప, పరిశుద్ధ బాధ్యతను అంగీకరించటమన్నదే ప్రవర్తనను ఉన్నతం చేస్తుంది. దానికి సమున్నత మానసిక, ఆధ్యాత్మిక శక్తుల చర్య అవసరమౌతుంది. అది మనసును హృదయాన్ని బలపర్చి పవిత్రపర్చుతుంది. దేవుని శక్తి పై నమ్మకముంచటం ద్వారా బలహీనుడు బలవంతుడు కావచ్చు, అతడి సేవ నిర్ణయాత్మకం కావచ్చు, అతడు విస్తారమైన, గొప్ప ఫలితాలు సాధించవచ్చు. ఇది ఎంత అద్భుతం! తక్కువ జ్ఞానంతో ప్రారంభించి, సాధారణ రీతిలో తనకు తెలిసింది పంచుతూ ఇంకా ఎక్కువ జ్ఞానం కోసం పట్టుదలతో అన్వేషించే వ్యక్తి తన కోసం వేచిఉన్న పరలోక ఐశ్వర్యాన్నంతటిని కనుక్కుంటాడు. వెలుగును ఇతరులకి ఇవ్వటానికి ఇతడు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువ వెలుగును పొందుతాడు. ఆత్మల పట్ల ప్రేమతో దైవ వాక్యాన్ని విశదీకరించటానికి ఒక వ్యక్తి ఎంత క్కువగా ప్రయత్నిస్తే, అతడికి వాక్యం అంత సరళమౌతుంది. మనం మన జ్ఞానాన్ని మన శక్తిసామర్థ్యాల్ని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత ఎక్కువ జ్ఞానం అంత ఎక్కువ శక్తి మనకు లభిస్తాయి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 354. ChSTel 114.2
ప్రతీ వ్యక్తి దేవుని సేవ చెయ్యాలి. ఆత్మల రక్షణ నిమిత్తం సేవ చెయ్యాలి. ప్రతీ వ్యక్తి వివేకం కనపర్చాలి. ఎవరో వచ్చి తనను పనిలో పెట్టటానికి సోమరిగా వేచి ఉండకూడదు. మిమ్మల్ని పనిలో పెట్టగల “ఆ వ్యక్తి” గంపెడు బాధ్యతలు గలవాడు. అతడి ఆదేశం కోసం వేచి ఉంటే సమయం గడిచిపోతుంది. వెంటనే దిద్దుబాటు చేసుకోటానికి దేవుడు మీకు జ్ఞానాన్నిస్తాడు. ఎందుకంటే ఆయన ఈ పిలుపునిస్తున్నాడు, “కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుము.” “నేడు మారాయన శబ్దమును వినినయెడల... మా హృదయములను కఠినపరచుకొనకుడి.” హెబ్రీ 3 : 8. “కుమారుడా” అన్నకమ్మని తొలి పలుకుతో ప్రభువు తన విధిని తెలుపుతున్నాడు. అది ఎంత మృదువైనది, కరుణార్ధమైనది! అయినా ఎంత అత్యవసరమైనది! ఆయన ఆహ్వానం ఆజ్ఞ కూడా. కౌన్స్టిల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 419. ChSTel 114.3
దృఢ సంకల్పంతో చేసే సేవ వలన దుర్మార్గాన్ని ప్రతిఘటించటానికి శక్తి వస్తుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 105. ChSTel 115.1
న్యాయం, కృప, ఉదారతతో కూడిన ప్రతీ చర్య, ప్రతీ క్రియ పరలోకానికి సంగీతంలా ఉంటాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ 16, 1881. ChSTel 115.2
క్రీస్తు స్వభావం మిషనెరీ స్వభావం. నూతన హృదయంలోని మొట్టమొదటి కోరిక ఇతరుల్ని కూడా రక్షకుని వద్దకు తీసుకురావాలన్న తపన. ది గ్రేట్ కాంట్రవర్సీ, పు. 70. ChSTel 115.3
మనం చేయాల్సిందిగా క్రీస్తు ఆదేశించిన సేవను ఆసక్తితో చేయట మొక్కటే కృపలో పెరిగే మార్గం. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 7, 1887. ChSTel 115.4
దేవుని సేవ చెయ్యటానికి బయలుదేరటానికి ముందు గొప్ప అవకాశం కోసం గాని లేక అసాధారణ సమర్ధతల కోసంగాని ఎదురు చూడకూడదు. స్టెప్స్ టు క్రైస్ట్, పు. 83. ChSTel 115.5
అతడు విద్యగలవాడైనా విద్యలేనివాడైనా ఏ మనిషి తన శక్తులన్నింటినీ దేవుని సేవకు తోటి మనుషుల సేవకు ఉపయోగిస్తాడో అతడు సమాజానికి దీవెనగా ఉంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. సదర్న్ వాచ్ మేన్. ఏప్రి. 2, 1903. ChSTel 115.6
గొప్ప సేవ చెయ్యటానికి దేవుడు ఎవరికి యోగ్యతలిచ్చాడో వారిలో అనేకులు తక్కువ ప్రయత్నిస్తున్నందువల్ల బహు కొంచెమే సాధించ గలుగుతున్నారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 331. ChSTel 115.7
మీరు వందలో తొంభై తొమ్మిది సార్లు విఫలులైనా, నాశనం నుంచి ఆ ఒక్క ఆత్మను రక్షిస్తే, మీరు ప్రభువు సేవలో గొప్ప కార్యం చేసినవారు అవుతారు. టెస్టిమొనీస్, సం., పు. 132. ChSTel 115.8
తన శ్రద్ధాసక్తులు పంచుకోటానికి భూమి పై మరోవ్యక్తి లేడన్నట్లు, తన కుమారుణ్ని ఇంకో ఆత్మకోసం ఇవ్వలేదన్నట్లు, దేవునికీ ప్రతీ ఆత్మకూ మధ్య ఉన్న సంబంధాలు ప్రత్యేకమైనవి, సంపూర్ణమైనవి. స్టెప్స్ టు క్రైస్ట్, పు. 100. ChSTel 116.1
ప్రభువు చూస్తాడు, గ్రహిస్తాడు. మీ వరాల్ని ప్రతిష్ఠిత వరంగా ఆయన సేవకు ఇచ్చినట్లయితే, మాకు బలహీనతలున్నా ఆయన మిమ్మల్ని ఉపయోగిస్తాడు. ఎందుకంటే క్రియాశీలమైన, నిస్వార్థమైన సేవలో బలహీనులు బలవంతులై ఆయన మెచ్చుకోలును పొందుతారు. ప్రభువు సంతోషానికి శక్తికి ఆస్పదం. మీరు నమ్మకంగా ఉంటే సమస్త జ్ఞానానికీ మించిన దేవుని సమాధానం ఈ జీవితంలో మాకు ప్రతిఫలంగా ఉంటుంది. భావి నిత్య జీవితంలో మీరు ప్రభువు సంతోషంలో ప్రవేశిస్తారు. టెస్టిమొనీస్, సం. 8, పులు 33,34. ChSTel 116.2
వరాలు లేనివారు దేవుని ప్రేమలో నమ్మకంగా నిలిచి ఉంటే క్రీస్తుకి అనేక ఆత్మల్ని సంపాదించవచ్చు. హార్లన్ పేజ్ పేదవాడు. సామాన్య సామర్థ్యం, పరిమిత విద్యగల మెకానిక్. అయినా దేవుని సేవాభివృద్ధి తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడి కృషి అద్భుత విజయం సాధించింది. వ్యక్తిగత సంభాషణలో, ప్రార్థనలో సాటి మనుషుల రక్షణ కోసం శ్రమించాడు. ప్రార్థన సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఆదివార పాఠశాలలు వ్యవస్తీకరించాడు. కరపత్రాలు, మన సాహిత్యం పంచాడు. మరణ శయ్యపై ఉన్నప్పుడు, నిత్యత్వపు నీడలు ముఖం పై నిలవగా అతడు ఇలా చెప్పగలిగాడు, “ఇదంతా దేవుని కృప అని నేను చేసిందేదైనా ఉంటే అది నా య్యోతను బట్టి కాదని నాకు తెలుసు. అయితే నా వ్యక్తిగత కృషి ద్వారా వందకు పైగా ఆత్మలు మారుమనసు పొంది దేవున్ని అంగీకరించారనటానికి నాకు నిదర్శనముంది.” టెస్టిమొనీస్, సం.5, పులు. 307, 308. ChSTel 116.3
ఈ లోకం క్రైస్తవుడి పరలోకం కాదు. అది దేవుని కర్మాగారం. పరిశుద్ధ పరలోకంలోని పాపరహిత దూతలతో నివసించటానికి ఇక్కడ మనం సిద్దం చెయ్యబడతాం. టెస్టిమొనీస్, సం. 2, పు. 187. ChSTel 116.4
క్రీస్తు శిష్యుల్లోని మిక్కిలి సామాన్యులు, మిక్కిలి పేదవారు ఇతరులికి ఆశీర్వాదంగా ఉండవచ్చు. తాము ప్రత్యేకమైన మేలు చేస్తున్నట్లు వారు గుర్తించకపోవచ్చు. కాని తమకు తెలియకుండావారు చూపే ప్రభావం దీవెన కెరటాలు ప్రారంభించవచ్చు. అవి విశాలమౌతాయి. లోతుగా వెళ్తాయి. ఆ మంచి ఫలితాల గురించి ఆ చివరి ప్రతిఫలం కలిగే దినం వరకూ వారికి తెలియకపోవచ్చును. తాము ఏదో గొప్ప పని చేస్తున్నామని వారు భావించకపోవచ్చు లేక వారికి తెలియకపోవచ్చు. జయం గురించి ఆందోళన చెందివారు ఆలసిపోటం అవసరం లేదు. దేవుడు తమకు నియమించే పనిని చేస్తూ వారు త్వరగా ముందుకిపోవాలి. వారి జీవితం వ్యర్థం కాదు. వారి ఆత్మలు క్రీస్తు పోలికలో రోజుకి రోజు పెరుగుతూ ఉంటాయి. వారు ఈ జీవితంలో దేవుని జత పనివారవుతారు. ఇలా వారు ఉన్నత సేవకు, రానున్న జీవితంలోని ఆనందానికి సిద్ధపడ్డారు. సెప్స్టు క్రైస్ట్, పు. 83. ChSTel 117.1
తమను తాము క్రీస్తుకి సమర్పించుకునే వారు, అయినా ఆయన సేవలో గొప్ప పని చెయ్యటానికి లేదా గొప్ప త్యాగం చెయ్యటానికి ఎలాంటి అవకాశాన్ని చూడనివారు అనేకులున్నారు. దేవునికి అంగీకృతమైంది. హతసాక్షి స్వయం సమర్పణ కానవసరంలేదు. పరలోక గ్రంథాల్లో ఉన్నతంగా నిలిచేవాడు ప్రతీదినం మరణాపాయాన్ని ఎదుర్కుని సేవచేసే మిషనెరీ కాపోవచ్చు అన్న మాటలు వీరికి ఓదార్పు నివ్వవచ్చు. ఏ క్రైస్తవుడు దినదినం తన్ను తాను దేవునికి ప్రతిష్టించుకుంటాడో, ఉద్దేశంలో నిజాయితీగాను తలంపులో పవిత్రంగాను, రెచ్చగొట్టబడ్డప్పుడు సాత్వికంగాను, విశ్వాసంగాను భక్తిగాను, అతి స్వల్పమైన దానిలో నమ్మకంగాను ఉంటాడో వ్యక్తిగత జీవితంలో గృహజీవితంలో ఎవరు క్రీస్తు ప్రవర్తనను సూచిస్తాడో అతడు, లోక ప్రఖ్యాతిగాంచిన మిషనెరీ కన్నా లేక హతసాక్షికన్నా దేవుని దృష్టిలో ఎక్కువ విలువైనవాడు కావచ్చు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 403. ChSTel 117.2
సాధించిన పని మొత్తం కాదు లేక కంటికి కనిపించే ఆ పని ఫలితాలుకాదు, కాని ఆ పనిని చేసేవారు ఏ స్వభావంతో చేస్తారో అది దేవుని దృష్టిలో విలువను సంతరించుకుంటుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 397. ChSTel 117.3
ప్రభువు అంగీకారం లభించేది పని గొప్ప తనం వల్లకాదు, దాని అనేక లాభాల వల్లకాదు గాని, కొద్దిపాటి వాటిలో సయితం నమ్మకంగా ఉన్నందుకు. మనం సాధించే గొప్ప ఫలితాల్ని గాక మనం ఏ ఉద్దేశాలతో పనులు చేస్తామో వాటిని దేవుడు పరిగణిస్తాడు. సాధించిన పని గొప్పతనం కన్నా మంచితనాన్ని, విశ్వసనీయతను ప్రభువు ఎక్కువ విలువ గలవిగా పరిగణిస్తాడు. టెస్టిమొనీస్, సం. 2, పులు. 510, 511. ChSTel 118.1
చిన్నచిన్న పనుల్ని లెక్క చెయ్యకుండా పెద్ద పని కోసం కని పెట్టకండి. చిన్న పనినే మీరు విజయవంతంగా చెయ్యవచ్చు. పెద్ద పనిలో మీరు పూర్తిగా అపజయం పొంది నిస్పృహకు గురికావచ్చు. చేయాల్సిన పని ఎక్కడున్నట్లు మీరు చూసినా దాన్ని చేపట్టి చెయ్యండి. మీరు ధనికులైనా దరిద్రులైనా, గొప్పవారైనా కొద్దివారైనా, దేవుడు తనకు క్రియాశీల సేవ చెయ్యటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ చేతుల్లోకి వచ్చిన పనిని మీ శక్తి కొద్దీ చెయ్యటం ద్వారా పనికి సామర్థ్యాన్ని అభిరుచిని సంపాదించగలగుతారు. మీకు అనుదినం వచ్చే తరుణాల్ని నిర్లక్ష్యం చెయ్యటం వలన మీరు ఫలించకుండా ఎండిపోతారు. ఈ కారణం చేతనే ప్రభువు తోటలో అన్ని ఫలించని చెట్లున్నాయి. టెస్టిమొనీస్, సం. 9, పు. 129. ChSTel 118.2
మనకున్న ప్రతీ వరాన్ని మనం ఉపయోగించాలని ప్రభువు కోరుతున్నాడు. మనకు లేని అర్హతల్ని ఆయన మనకు అసహజంగా అనుగ్రహించడు. కాని మనకున్న దాన్ని మనం వినియోగిస్తుండగా, ప్రతీ శక్తిని వృద్ధిపర్చుకోటానికి, బలపర్చుకోటానికి మనకు తోడ్పడ్డాడు. ప్రతీ హృదయపూర్వక త్యాగం వలన మన శక్తులు వృద్ధి చెందుతాయి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు 353, 354. ChSTel 118.3
అన్ని విధాల బీదలైనవారిని చూసినప్పుడు క్రీస్తు హృదయం సంతోషిస్తుంది. దుర్వినియోగానికి గురి అయిన సాత్వికుల్ని చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నీతి నిమిత్తం తమ ఆకలి తీరనట్లు కనిపించేవారిని చూసినప్పుడు సంతోషిస్తాడు. ప్రారంభించటానికి శక్తిలేని అనేకుల్ని చూసినప్పుడు సంతోషిస్తాడు. అనేకమంది వాక్యపరిచారకుల్ని నిరుత్సాహపర్చే పరిస్థితుల్ని ఆయన స్వాగతిస్తాడని నా తలంపు. గాస్పుల్ వర్కర్స్, పు. 37. ChSTel 118.4
క్రీస్తు సేవ చెయ్యటానికి మనం అన్యదేశాలికి వెళ్లనవసరంలేదు లేదా పరిమితమైన కుటుంబ వలయాన్ని - మన విధి అక్కడే నెరవేర్చాల్సి ఉంటే - విడిచి పెట్టనవసరం లేదు. కుటుంబవలయంలో, సంఘంలో, మనం సహవాసం చేసేవారి మధ్య, మనం వ్యాపారం ఎవరితో చేస్తామో వారి మధ్య మనం క్రీస్తు సేవ చెయ్యవచ్చు. స్టెప్స్ టు క్రైస్ట్, పు. 81. ChSTel 119.1
మనం క్రీస్తు జీవితాన్ని, బోధనల్ని మన అధ్యయనం చేసకుంటుంటే, చోటుచేసుకునే ప్రతీ సంఘటన చక్కని ప్రసంగానికి విషయాన్ని సమకూర్చవచ్చు. టెస్టిమొనీస్, సం. 9, పు. 63. ChSTel 119.2
ఇహలోక జీవితం పరలోక జీవితానికి ఆరంభం. లోకంలోని విద్య పరలోక నియమాలకి ప్రారంభం. ఇక్కడ జీవనోపాధికి చేసే పని అక్కడ మనం చెయ్యాల్సిఉన్న పనికి శిక్షణనిస్తుంది. ప్రవర్తనలోను పరిశుద్ద సేవలోను మనమున్న స్థితి ముందు మనం ఎలాగుంటామో అన్నదానికి ఛాయరూపం. ఎడ్యుకేషన్, పు. 307. ChSTel 119.3
సేవలో క్రీస్తుతో సహవాస భాగ్యాన్ని తోసిపుచ్చేవారు తన మహిమలో ఆయనతో కలిసి పాలుపొందటానికి యోగ్యతనిచ్చే ఏకైక శిక్షణను తోసిపుచ్చుతున్నారు. ఈ జీవితంలో ప్రవర్తనకు బలాన్ని సౌజన్యతను ఇచ్చే శిక్షణను వారు తోసిపుచ్చుతారు. ఎడ్జుకేషన్, పు. 264. ChSTel 119.4
తాము స్వార్థ జీవితం జీవించి, తమ స్వప్రయోజనాలు నెరవేరిన తర్వాత ప్రభువు సంతోషంలో ప్రవేశించవచ్చునని ఎవరూ తలంచకుందరుగాక. వారు స్వార్ధరహిత ప్రేమ ఆనందంలో పాలు పొందలేరు. వారు పరలోక రాజ్యంలో ఉండటానికి యోగ్యులు కారు. పరలోకంలోని స్వచ్చమైన వాతావరణాన్ని వారు అభినందించలేరు. దేవదూతల స్వరాలు వారి వీణెల సంగీతం వారిని తృప్తిపర్చలేవు. వారి మనసులికి పరలోక విజ్ఞాన శాస్త్రం ఓ మర్మంగా ఉంటుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు 364, 365. ChSTel 119.5
సామాన్య ప్రజలు పనివారుగా తమ స్థానాల్ని ఆక్రమించాల్సి ఉన్నారు. రక్షకుడు మానవాళి దుఃఖాల్లో పాలుపంచుకున్నట్లు, వారు సాటి మనుషుల దుఃఖాల్లో పాలుపంచుకుంటుండగా రక్షకుడు తమతో కలిసి పనిచెయ్యటం వారు విశ్వాసమూలంగా చూస్తారు. టెస్టిమొనీస్, సం.7, పు. 272. ChSTel 119.6
ప్రతీ శిష్యుడిలో తన చిత్రపటం గీయించుకోటానికి క్రీస్తు కూర్చుని ఉన్నాడు. ప్రతీవారు “తన కుమారునితో సారూప్యము గలవారగుటకు” దేవుడు ముందుగా నిర్ణయించాడు. ప్రతీవారిలోను క్రీస్తు దీర్ఘశాంతంగల ప్రేమ, పరిశుద్ధత, సాత్వికం, కృప, సత్యం లోకానికి ప్రదర్శితం కావలసి ఉంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 827. ChSTel 120.1
సేవాపీఠం పై సమస్తం సమర్పించాల్సిందంటూ ప్రతీ వ్యక్తికీ పిలుపు వస్తున్నది. మనమందరం ఎలీషాలా సేవ చెయ్యాలని దేవుడు కోరటం లేదు. మనకున్నదంతా అమ్మెయ్యమని ఆయన ఆదేశించటంలేదు. మన జీవితాల్లో తన సేవకు మొదటి స్థానానివ్వమని, లోకంలో తన సేవ ప్రగతికి ఏమి చెయ్యకుండా ఒక్క దినాన్ని కూడా గడవనివ్వవద్దని దేవుడు కోరుతున్నాడు. అందరూ ఒకే రకమైన సేవ చెయ్యాలని ఆయన కోరటంలేదు. ఒకరు విదేశ మిషనెరీగా పిలుపు పొందవచ్చు. ఇంకొకరు సువార్త సేవ పోషణకు ద్రవ్యం ఇవ్వవలసిందిగా పిలుపు పొందవచ్చు. దేవుడు ప్రతీవారి కానుకను అంగీకరిస్తాడు. జీవితం, దాని ఆసక్తులు ఆయనకు సమర్పితం కావటం అవసరం. ఈ సమర్పణ చేసేవారు దేవుని పిలుపు విని దానికి విధేయులవుతారు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 221. ChSTel 120.2
ఆలోచనలు చేసి, ప్రణాళికలు వేసుకునే లోకజ్ఞాని, నిత్యం తన వ్యాపారాన్నే మనసులో ఉంచుకునే వ్యక్తి, నిత్య జీవానికి సంబంధించిన విషయాల్లో జ్ఞానం సంపాదించటానికి కృషి చెయ్యాలి. లోక భాగ్యం సంపాదించటానికి చేసే కృషి అంత కృషి పరలోక ఐశ్వర్యం కోసం దేవుని జీవితం వంటి జీవితం కోసం చేస్తే అతడు సాధించలేనిది ఏముంటుంది? టెస్టిమొనీస్, సం. 6, పు. 297. ChSTel 120.3
ఈ కాలానికి ఉద్దేశించిన సత్య సందేశాన్ని ప్రకటించటానికి సామాన్య స్థానాల్లో ఉన్న మనుషుల్ని దేవుడు ఆవేశపర్చుతాడు. అట్టివారనేకులు చీకటిలో ఉన్నవారికి వెలుగు ప్రకాశింపజెయ్యటానికి దైవాత్మ ప్రేరణవల్ల ఇటు అటు పరుగెత్తటం చూస్తాం. సత్యం వారి ఎముకల్లో అగ్నిలామండి, చీకటిలో ఉన్నవారికి వెలుగు నివ్వాలన్న ఆకాంక్షను వారిలో నింపుతుంది. ఆయన ప్రేరణను స్వీకరించే వారిపై ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. మానవుడి నిబంధనల్ని హెచ్చరికల్ని తోసిపుచ్చి వారు ప్రభువు సైన్యంలో చేరారు. టెస్టిమొనీస్, సం.7, పులు. 26,27. ChSTel 120.4