Go to full page →

భవిష్యత్తులో పశ్చాత్తాప దినం CDTel 161

247. అనేకమంది అతి తిండివలన విషయసుఖేఛ్చల తృప్తి వలన మానసిక శ్రమకు శారీరక శ్రమకు అసమర్థులవుతారు. పాశవిక ప్రవృత్తులు బలపడి నైతిక, ఆధ్యాత్మిక శక్తులు బలహీనమౌతాయి. మనం ప్రభువు మహా స్వేత సింహాసనం చుట్టూ నిలబడినప్పుడు, అనేకుల జీవితాల రికార్డులు ఎలా ఉంటాయి? దేవుడిచ్చిన శక్తుల్ని దుర్వినియోగం చేసి ఉండకుంటే తాము ఏమి సాధించి ఉండే వారో వారు అప్పుడు చూస్తారు. దేవుడు తమకు అప్పగించిన శారీరక శక్తిని మానసిక శక్తిని చేలునికి ఇచ్చి వుంటే మానసికంగా ఎంత ఔన్నత్యాన్ని సాధించగలిగి ఉండేవారు అప్పుడు వారు గుర్తిస్తారు. వేదనతో నిండిన పశ్చాత్తాపంతో వారు తమ జీవితాల్ని మాళ్లీ మొదలు పెట్టి నివసించాలని కోరుకుంటారు. CDTel 161.1

[అతి తిండి వలన మానసిక, శారీరక పర్యవసానాలు-219,220] CDTel 161.2