Go to full page →

అస్వాభావిక ఆహారేచ్చ నియంత్రణ అవసరం CDTel 161

(1890) C.T.B.H.150, 151 CDTel 161.3

248. దైవ ప్రజలు ఆత్మ త్యాగం వేదికపై తమ స్థానంలో నిలిచి, ఆహారవాంఛ శరీరేచ్చలకు దూరంగా ఉండేందుకు అన్ని విషయాల్లో ఆశానిగ్రహం కలిగి నివసించేందుకు దేవుడు వారిని లోకసంబంధమైన దుబారా అలవాట్లు అభ్యాసాలనుంచి బయటికి నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించే ప్రజలు ప్రత్యేకతగల ప్రజలు. వారు లోకస్తుల్లాగ ఉండరు. దేవుని మార్గనిర్దేశాన్ని అనుసరిస్తే వారు ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చి తమ చిత్తాల్ని ఆయన చిత్తానికి లోపర్చుతారు. అప్పుడు వారి హృదయాల్లో క్రీస్తు నివసిస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంటుంది. మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం అంటున్నాడు అపోస్తలుడు. తమ శరీర శక్తికి హాని కలిగే విధంగా తన బిడ్డలు తమని తాము ఉపేక్షించుకోవాలని దేవుడు కోరటం లేదు. శరీరారోగ్యాన్ని కాపాడుకోటానికి వారు ప్రకృతి చట్టానికి విధేయులవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నిర్దేశించే మార్గం ప్రకృతి మార్గం. అది ఏ క్రైస్తవుడికైనా చాలినంత విశాలమైన మార్గం. మన పోషణకు ఆనందానికి దేవుడు ఆహారాన్ని ఆహార పదార్థాల్ని సమకూర్చుతున్నాడు. అయితే ఆరోగ్యాన్ని పరిరక్షించి దీర్ఘాయువు ఇచ్చే స్వాభావికాహారాన్ని మనం తిని ఆనందించేందుకు ఆయన తిండిని నియంత్రిస్తున్నాడు. అస్వాభావిక ఆహార వాంఛ గురించి జాగ్రత్తగా ఉండండి! దాన్ని నియంత్రించండి! ఉపేక్షించండి! మనం వక్రమైన ఆహార వాంఛను అలవరచుకుంటే, మన శరీర వ్యవస్థకు సంబంధించిన చట్టాల్ని అతిక్రమించి, మన శరీరాల్ని దుర్వినియోగం చేస్తున్నందుకు, వ్యాధిని మీదికి తెచ్చుకుంటున్నందుకు బాధ్యత వహిస్తాం. CDTel 161.4

(1909) 9T 153,154 CDTel 162.1

249. మాంసాహారం, టీ, కాఫీ, కొవ్వు పదార్థాలతో అనారోగ్యకరంగా తయారుచేసే ఆహారం తాలూకు కీడులను గురించి ఉపదేశం పొందినవారు, త్యాగం చెయ్యటం ద్వారా దేవునితో నిబంధన చేసుకోటానికి నిశ్చయించుకున్నవారు, తమకు హానికలిగిస్తాయని తెలిసిన ఆహారాన్ని ఆహారపదార్థాల్ని తినరు. ఆహార వాంఛ ప్రక్షాళన కావాలని, మంచి చెయ్యని వాటిని ఉపయోగించే విషయంలో ఆత్మో పేను పాటించాలని దేవుడు డిమాండు చేస్తున్నాడు. తన ప్రజలు ఆయన ముందు పరిపూర్ణులుగా నిలబడకముందు జరగాల్సి ఉన్న పని ఇది. CDTel 162.2

హెల్త్ రిఫార్మర్. సెప్టెంబర్, 1871 CDTel 162.3

250. అతిక్రమ ఫలితాల్ని అనుభవించకుండా ఒక నిబంధనను అతిక్రమించేందుకు మన శరీర అంగక్రమ నిర్మాణాన్ని దేవుడు మార్చలేదు. మార్చే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. అనేకులు వెలుగును చూడకుండా కావాలని కళ్లు మూసుకుంటారు.... తమ కోర్కెలు ఆహారవాంఛలు మనస్సాక్షికి లోబడి ఉంటే తిండిలోను, బట్టలు ధరించటంలోను ఇష్టాన్ని బట్టి, ఫ్యాషన్ ని బట్టి, రుచినిబట్టి కాక నియమాన్ని బట్టి వారు నడుచుకుంటారు. CDTel 162.4