Go to full page →

విభాగం IX—వేళకు భుజించటం CDTel 174

భాగం I - రోజుకి తినే భోజనాలు CDTel 175

కడుపుకి విశ్రాంతి అవసరం CDTel 175

ఉత్తరం 7a, 1896 CDTel 175.1

267. కడుపు విషయంలో జాగ్రత్త వహించాలి. దానికి నిత్యం పని పెట్టకూడదు. ఎంతగానో దుర్వినియోగమైతున్న ఈ అవయవానికి కొంత శాంతి ప్రశాంతత విశ్రాంతి ఇవ్వండి. ఒక భోజనం అయిన తర్వాత కడుపు తన పనిని చేశాక, దానికి విశ్రమించే అవశం లభించక ముందు, ఎక్కువ ఆహారాన్ని పరిష్కరించటానికి ప్రకృతి సమకూర్చే జఠర రసం చాలినంత సరఫరా కాకముందు దానిలోకి మరింత ఆహారాన్ని నెట్టకండి. భోజనానికి భోజనానికి మద్య కనీసం ఐదు గంటల వ్యవధి ఉండాలి. మీరు పరీక్షించి చూస్తే దినానికి మూడుసార్లు భుజించటం కన్నా రెండుసార్లు భుజించటం మంచిదని తెలుస్తుంది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. CDTel 175.2