Go to full page →

రెండు పూటల భోజన ప్రణాళిక CDTel 178

(1903) ED 205 CDTel 178.3

272. ఎక్కువ సందర్భాల్లో రోజుకి మూడు పూట్ల భోజనం కన్నా రెండు పూట్ల భోజనం మంచిది. రాత్రి భోజనం ముందుగా తీసుకున్నప్పుడు అంతకు ముందు తీసుకున్న భోజనం జీర్ణక్రియలో అది జోక్యం చేసుకుంటుంది. ఆలస్యంగా తీసుకున్నప్పుడు పడుకునే సమయానికి ముందు అది జీర్ణం కాదు. ఈ రెండు సందర్భాల్లోను కడుపుకి సరిఅయిన విశ్రాంతి లభించదు. నిద్రకు భంగం కలుగుతుంది. మెదడు, నరాలు అలసిపోతాయి. బ్రేక్ఫాస్ట్ కి ఆకలి ఉండదు. శరీర వ్యవస్థంతా అలసిపోయి ఆనాటి విధులకి సంసిద్ధంగా ఉండదు. CDTel 178.4

[పిల్లలకి రెండుపూట్ల భోజన ప్రణాళిక - 343,344] CDTel 178.5

(1905) M. H.321 CDTel 178.6

273. రోజుకి రెండు పూటలు భోజనం చెయ్యటం ఆరోగ్యదాయకమని నిరూపితమయ్యింది. అయినా కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులికి మూడోపూట భోజనం అగత్యం కావచ్చు. మూడోపూట తినటం అవసరమైతే అది చాలా తక్కువగా ఉండి సులభంగా జీర్ణమయ్యే ఆహారమై ఉండాలి. సాయంకాల భోజనానికి క్రేకర్సు, ఇంగ్లీష్ బిస్కెట్ - పండ్లు, తృణధాన్యాల కాఫీ సరిపోతాయి. CDTel 178.7

[C.T.B.H.51,58] (1890)C.H.156 CDTel 179.1

274. చాలామంది మూడు పూటలు తినటం కన్నా రెండు పూటలు తినటం ద్వారా మెరుగైన ఆరోగ్యం కలిగి ఆనందిస్తారు. ఇతరులు తామున్న పరిస్థితులను బట్టి కొంచెం రాత్రి భోజనం తినటం అవసరమవ్వవచ్చు. అయితే ఇది చాలా స్వల్పంగా ఉండాలి. ఎవరూ ఇంకొకరికి ఒరవడిగా భావించుకొని ప్రతీవారు తాను చేసినట్లే చెయ్యాలని అనుకోకూడదు. CDTel 179.2

ఆరోగ్యం కోరే ఆహారాన్ని ఇవ్వకపోటం ద్వారాను అది భరించకూడని భారాన్ని దానిపై మోపి దాన్ని దుర్వినియోగం చెయ్యటం ద్వారాను కడుపుని వంచించవద్దు. ఆత్మనిగ్రహం అలవర్చుకోండి. ఆహారవాంఛను నియంత్రించండి. దాన్ని స్వస్తబుద్ధి అదుపులో ఉంచండి. అతిథులున్నప్పుడు ఆరోగ్యానికి హానికలిగించే ఆహారంతో మీ భోజనబల్లను నింపటం అవసరమని భావించకండి. మీ కుటుంబం ఆరోగ్యాన్ని, మీ పిల్లల పై పడే ప్రభావాన్నీ, మీ అతిథుల అలవాట్లు అభిరుచుల్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. CDTel 179.3

(1881) 4T 574 CDTel 179.4

275. ఇతరులు మూడోపూట తినటం చూడటం కొందరికి తాళలేని శోధన అవుతుంది. అది ఆహారం కోసం కడుపు ఇచ్చే పిలుపు కాక నియమంచే పటిష్ఠం కాని, ఆత్మత్యాగంచే క్రమ శిక్షితంకాని మనసు వ్యక్తంచేసే కోరిక అయినప్పుడు తాము ఆకలిగా ఉన్నట్లు వారు ఊహించుకుంటారు. CDTel 179.5