చిర్ర) బుర్రు లకు పరిష్కారంగా CDTel 179.6
(1880) 4T 501,502 CDTel 179.7
276. సోదరుడు ఎచ్. అనుసరించే మార్గం సరయ్యింది కాదు. అతడి ఇష్టాయిష్టాలు చాలా పటిష్ఠమైనవి. అతడు తన ఉద్వేగాల్ని స్వస్త బుద్ధి నియంత్రణ కింద ఉంచటం లేదు. సోదరుడు ఎచ్. ఎక్కువ తినటం అనుచిత సమయాల్లో తినటం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇందువల్ల నీ మెదడుకు రక్తం ఎక్కువగా ప్రవహిస్తున్నది. మనసు గందరగోళానికి గురి అవుతుంది. నీపై నీకు సరిఅయిన నియంత్రణ ఉండదు. నీవు మానసిక సమతుల్యతలేని వ్యక్తిలా కనిపిస్తావు. నీ కదలికలు బలంగా ఉంటాయి. నీవు చీటికీ మాటికీ చిర్రు బుర్రులాడావు. విషయాల్ని వక్రమైన వెలుగులో చూస్తావు. ఎక్కువ వ్యాయామం, మితాహారం నీ ఆరోగ్యానికి ఎంతో అవసరం. రాత్రి పూట తినాలనిపిస్తే, ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకో. రాత్రి తిననందుకు ఉదయానికి ఉల్లాసంగా మెరుగగా ఉంటావు. CDTel 179.8