Go to full page →

నిజమైన ఉపవాసం CDTel 192

ఉత్తరం 73,1896] M.M.283 CDTel 192.2

305. ఉద్రేకం పుట్టించే ప్రతీ రకమైన ఆహారాన్ని విసర్జించటం, దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తున్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని సముచితంగా వినియోగించటం ఇదే అందరికి సిఫారసు చేయాల్సిన నిజమైన ఉపవాసం. శారీరకంగా ఏమి తినాలి ఏమి తాగాలి అన్నవాటిని గురించి తక్కువగాను, మొత్తం మతానుభవానికి శక్తిని నవజవాన్ని ఇచ్చే పరలోకాహారం గురించి మరెక్కువగాను మనుషులు తలంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. CDTel 192.3

R.& H., ఫిబ్రవరి 11, 1904 CDTel 192.4

306. ఇప్పుడు, ఇప్పటినుంచి లోకాంతం వరకు దైవప్రజలు తమ సొంత వివేకాన్ని నమ్ముకోకుండా అప్రమత్తులై నాయకుడైన ప్రభుని చిత్తశుద్ధితో నమ్మాలి. వారు ఉపవాస ప్రార్థనకు దినాల్ని ప్రత్యేకించాలి. ఆహారం తినకుండా ఉండటం అవసరం లేకపోవచ్చు. అయితే వారు అతి సామాన్యమైన ఆహారం మితంగా తినాలి. CDTel 192.5

ఉత్తరం 206, 1908 CDTel 192.6

307. ఎంత ఉపవాసం చేసినా అది దేవుని వాక్యం పై సామాన్య విశ్వాసానికి ప్రత్యామ్నాయం కాదు. “అడుగుడి మీకు దొరుకును” అన్నాడు ప్రభువు. ...మీరు నలభైదినాలు ఉపవాసముండాల్సిన అవసరంలేదు. ప్రభువు ఆ ఉపవాసాన్ని శోధనారణ్యంలో మీకోసం భరించాడు. అలాంటి ఉపవాసంలో ఎలాంటి మహిమా లేదు. కాని క్రీస్తు రక్తంలో ఉంది. CDTel 192.7

ఉత్తరం 206, 1908 CDTel 192.8

308. మనసును హృదయాన్ని చిత్రాన్ని దేవునికి లోపర్చే స్వభావమే యథార్థమైన ఉపవాస స్ఫూర్తి, CDTel 192.9