Go to full page →

(1892) G.W. 236 (పాతముద్రణ) CDTel 191

303. బాధ్యతలు వహించేవారు ఒకరితో ఒకరు సంప్రదించుకోటానికి, ఆయన మాత్రమే ఇవ్వగల వివేకం కోసం ప్రార్థించటానికి తరచుగా సమావేశమవ్వటం దేవుని చిత్తం. మీ కష్టాల్ని ఏకమనసుతో దేవునికి విన్నవించుకోండి. తక్కువ మాట్లాడండి. వెలుగులేని మాటలు మాట్లాడటంలో ఎంతో సమయం వృధా అవుతున్నది. ధారాళంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన వివేకం కోసం సహోదరులు ఉపవసించి ఏక మనసుతో ప్రార్థించాలి. CDTel 191.5

(1867) 1T 624 CDTel 191.6

304. దైవ సేవాభివృద్ధి నిమిత్తం, దేవునికి మహిమ కలిగేందుకోసం సత్యవిరోధిని ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడ్డప్పుడల్లా, ఆ సంఘర్షణలో వారు (సత్యవాదులు) ఎంత జాగ్రత్తగా వినయంగా ప్రవేశించాలి! హృదయ పరిశోధనతో, పాపపు ఒప్పుకోలుతో, యధార్థ ప్రార్థనతో, కొంతకాలం ఉపవాసంతో, అసత్యం దాని వాస్తవిక వైకల్యం కనిపించేటట్లు, దాని ప్రబోధకులు పూర్తిగా విఫలులయేటట్లు సహాయం చేసి, తన రక్షణను అనుగ్రహించాల్సిందిగా వారు దేవుని వేడుకోవాలి. CDTel 191.7

[భయంకర సమయంలో నివసిస్తున్న మనకు రక్షకుని ఉపవాసం ఓ పాఠం-238] CDTel 192.1