Go to full page →

వేళ ప్రకారం భోజనం చెయ్యటం CDTel 234

(1865) H. TO L., అధ్యా.2, పు.47 CDTel 234.2

343. తల్లి దగ్గరనుంచి పిల్లలు మొదటగా నేర్చుకోవలసిన విద్య వారి శారీరక ఆరోగ్యం గురించి. వారికి సామాన్యమైన ఆహారం, వారిని ఉత్తమ ఆరోగ్యస్థితిలో ఉంచే పరిమాణంలో ఇవ్వాలి. అది వారు క్రమబద్ధమైన కాలావధుల్లో, రోజుకి మూడుసార్లు కన్నా ఎక్కువ కాకుండా ఇవ్వాలి. మూడుసార్లుకన్నా, రెండుసార్లు ఇవ్వటం మెరుగు. పిల్లల్ని సరిగా క్రమశిక్షణలో పెడితే ఏడ్వటం వల్ల మారాం పెట్టటం వల్ల తమకేమీ లభించదని త్వరలో గ్రహిస్తారు. వివేకవంతమైన తల్లి తన ప్రస్తుత సుఖాల్ని పరిగణించక భవిష్యత్తులో తమకు మేలు కలిగేందుకు తన బిడ్డలికి శిక్షణనిస్తుంది. ఈ దృష్టితో తన బిడ్డలకి ఆహార వాంఛను నియంత్రించుకోటం, ఆరోగ్యవంతంగా ఆహారపానాలు తీసుకోటం వస్త్రాలు ధరించటానికి ఆత్మోపేక్ష ఆచరించటం ఆమె నేర్పించాలి. CDTel 234.3

(1880) 4T 502 CDTel 234.4

344. భోజనానికీ భోజనానికీ మధ్య మీ పిల్లల్ని క్యాండీలు, పండ్లు, గింజలు వంటి ఆహార పదార్థాల్ని తిననివ్వకూడదు. వారికి దినంలో మూడు భోజనాలకన్నా రెండు భోజనాలు మంచిది. ఇందులో తల్లిదండ్రులు ఆదర్శం చూపిస్తే, పిల్లలు త్వరలో దాన్ని ఆచరిస్తారు. భోజనం చెయ్యటంలో క్రమం పాటించకపోటం వల్ల జీర్ణమండల అవయవాల ఆరోగ్యపరిస్థితి దెబ్బతిని మీ పిల్లలు భోజనబల్ల వద్దకు వచ్చినప్పుడు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇష్టపడరు. తమకు మిక్కిలి హాని చేసే ఆహారాన్నే కోరతారు. చలిజ్వరంతోను బాధ పడుతుంటారు. వారి అనారోగ్యానికి వారి తల్లిదండ్రులే కారణం. తమ బిడ్డలు ఆరోగ్యదాయకమైన అలవాట్లు నేర్చుకునేటట్లు చూసి తద్వారా వ్యాధినుంచి వారిని రక్షించటం తల్లిదండ్రుల బాధ్య త. CDTel 234.5

హెల్త్ రిఫార్మర్, సెప్టెంబర్, 1860 CDTel 235.1

345. పిల్లలకి ఎక్కువసార్లు ఆహారం పెట్టటం కూడా జ్వరం రావటానికి ఇంకా ఇతర బాధలకి కారణమౌతుంది. కడుపుకి నిత్యం పని పెట్టకూడదు. దానికి విశ్రాంతి కాలావధులు అవసరం. అది జరగకపోతే పిల్లలు కోపంగా, చిరచిరలాడూ ఉంటారు. తరచు జబ్బుపడుతుంటారు. CDTel 235.2

[ఎప్పుడు ఎలా తినాలో పిల్లలకి నేర్పాలి-288] CDTel 235.3

[బాల్యంలో దానియేలు శిక్షణ-241] CDTel 235.4

[భోజనం చెయ్యటంలో క్రమత్వం-విభాగం IX చూడండి] CDTel 235.5