Go to full page →

గారాబం తాలూకు క్రూరమైన దయ CDTel 244

(1873) 3T 141 CDTel 244.2

358. ప్రస్తుత శోచనీయ పరిస్థితికి పెద్ద కారణం తల్లిదండ్రులు తమ బిడ్డల్ని భౌతిక చట్టాలకి విధేయులయ్యే విధంగా పెంచటం తమ బాధ్యతని గుర్తించకపోటమేనని దర్శనంలో నాకు చూపించటం జరిగింది. తల్లులు తమ బిడ్డల్ని విగ్రహాల్లా పూజించి, తమ ఆరోగ్యానికి హానిచేసి వారికి వ్యాధిని దుఃఖాన్ని కలిగిస్తుందని తెలిసినప్పటికీ వారిని తమ ఇష్టం వచ్చినట్లు తిననిస్తారు. ఈ క్రూరమైన దయ చాలా మట్టుకు ప్రస్తుత తరంలో ప్రదర్శిత మౌతుంది. ఆరోగ్యానికి ఆనందానికి హాని కలిగించి పిల్లల కోరికల్ని తీర్చుతారు. ఎందుకంటే ప్రస్తుతానికి వారు ఏమి కోరుతున్నారో దాన్ని ఇవ్వకుండటం కన్నా ఇవ్వటం తల్లికి సులువు. CDTel 244.3

ఈరకంగా తల్లులు చల్లుతున్న విత్తనాలు మొలిచి వాటి పంటని అవి ఇస్తాయి. తిండిని ఉపేక్షించటానికి తమ కోరికల్ని నియంత్రించుకోటానికి వారు తమ పిల్లలకి శిక్షణ నివ్వరు. అందుచేత వారు స్వార్థపరులు, కఠినులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అవుతారు. ఈ పని చేసే తల్లులు ఏమి విత్తుతారో ఆ పంటనే కన్నీటితో కోస్తారు. వారు దేవునికి విరోధం గాను తమ బిడ్డలకి విరోధంగాను పాపం చేస్తున్నారు. దేవుడు వారిని లెక్క అడుగుతాడు. CDTel 245.1

(1890) C.T.B.H.76,77 CDTel 245.2

359. తల్లిదండ్రులు పిల్లలు ఆ చివరి తీర్పులో కలుసుకున్నప్పుడు, ఆ దృశ్యం ఎలా ఉండబోతుంది! తిండి వాంఛకు, నికృష్ట దుర్నీతికి బానిసలై నైతికంగా నాశనమైన మానవ శకలాలుగా మిగిలిన వేల పిల్లలు తమని ఆ స్థితికి తెచ్చిన తమ తల్లిదండ్రులకు ముఖాముఖి నిలబడ్డారు. తల్లిదండ్రులు గాక ఇంకెవరు ఈ భయంకర బాధ్యత వహించాలి? ఈ పిల్లల్ని దేవుడు భ్రష్టుల్ని చేశాడా? లేదే! అయితే భయంకరమైన ఈ కార్యం చేసింది ఎవరు? వక్రతిళ్లు, ఆవేశాల రూపంలో తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి మార్పిడి అవ్వలేదా? దేవుడిచ్చిన మాదిరిననుసరించి వారిని తర్బీతు చెయ్యటం నిర్లక్ష్యం చేసినవారు ఆ పనిని పూర్తి చెయ్యలేదా? ఈ తల్లిదండ్రులందరూ పరిశీలనకు దేవుని ముందు నిలబడటం నిశ్చయం. CDTel 245.3