Go to full page →

ప్రయాణిస్తున్నప్పుడు పరిశీలనలు CDTel 245

హెల్త్ రిఫార్మర్, డి సెంబర్, 1870 CDTel 245.4

360. తమ పిల్లల ఆహారాభిరుచులు సున్నితమైనవని, మాంసం, కేకులు ఉంటేనేగాని వారు భోజనం చెయ్యరని తల్లిదండ్రులు చెప్పటం బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు విన్నాను. మధ్యాహ్న భోజనం పెట్టినప్పుడు ఈ పిల్లలకిచ్చిన ఆహారం నాణ్యతను పరిశీలించాను. అది తెల్లని గోధుమ బ్రెడ్డు, నల్ల పెప్పరు చల్లిన హేమ్ ముక్కలు, కారంగా ఉన్న పచ్చళ్లు, కేకు. పిల్లల పాలిపోయిన శరీరఛాయ పిల్లల కడుపు గురి అవుతున్న దుర్వినియోగాన్ని సూచిస్తున్నది. ఇతర కుటుంబానికి చెందిన పిల్లలు తమ ఆహారం చీజ్ తినటం ఈ పిల్లల్లో ఇద్దరు గమనించారు. తమ ముందున్న ఆహారం వారికి హితం కాలేదు. చివరికి వారి తల్లి కొంచెం చీజ్ తన పిల్లలకివ్వమని మనవి చేసింది. వారు తమ ఆహారం తినరన్నది ఆమె భయం . ఆ తల్లి ఇలా అన్నది, నా పిల్లలకి ఇది అన్నా అది అన్నా ఎంతో ఇష్టం. నేను అది వారికిస్తాను. ఎందుకంటే ఆహారవాంఛ తమ శరీరానికి అవసరమైన ఆహారం కావాలని పిల్లల్ని కోరుతుంది. CDTel 245.5

ఆహారవాంఛ వక్రీకృతం కాకపోతే ఇది వాస్తవం కావచ్చు. ఆకలి స్వాభావికమైనదీ ఉంది. భ్రష్టమైనదీ ఉంది. తమ బిడ్డలు మన్నుని, బలపాన్ని, కాఫీని, టీని, దాల్చినచెక్కని, లవంగాల్ని, మసాలాల్ని వాంఛించేంతగా వారి రుచి వక్రీకృతమై, అనారోగ్యకరమైన, ఉత్తేజం పుట్టించే ఆహారం తినటం తమ బిడ్డలకి వారి జీవితమంతా నేర్పించే తల్లిదండ్రులు, శరీర వ్యవస్థకి అవసరమైన దాన్నే ఆకలి కోరుతుందని చెప్పలేరు. ఆకలి వక్రీకృతమయ్యే వరకు దాన్ని తప్పుగా తర్బీతు చెయ్యటం జరుగుతుంది. కడుపుకు సంబంధించిన సున్నితమైన అవయవాలు తమ సున్నితమైన స్పందనను పోగొట్టుకునేంతగా ఉత్తేజితమై కాలిపోతాయి. సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన ఆహారం వారికి చప్పగా ఉంటుంది. దుర్వినియోగమైన కడుపుని మిక్కిలి ఉత్తేజకరమైన పదార్థాలతో ప్రోత్సహిస్తేనే గాని దానికి నియమితమైన పనిని చెయ్యటానికి అది నిరాకరిస్తుంది. సాధ్యమైనంత వరకు దాని స్వాభావిక గుణాల్ని పరిరక్షిస్తూ, మాంసం, జిడ్డునూనె, మసాలాలు ఉపయోగించకుండా తయారు చేసిన సామాన్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినటానికి ఈ పిల్లల్ని పసితనం నుంచి తర్బీతు చేసి ఉంటే రుచి, ఆకలి దెబ్బతినకుండా ఉండేవి. CDTel 246.1

దాని స్వాభావిక స్థితిలో అది చాలా మట్టుకు శరీరవ్యవస్థ కు అవసరమయ్యే ఆహారానాకి అనుకూలమైనదని సూచించేది. CDTel 246.2

తల్లిదండ్రులు పిల్లలు తమ నాజూకు భోజనాలు ఆరగిస్తుంటే, నేను నా భర్త మా సామాన్య భోజనం మా సాధారణ సమయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు తీసుకున్నాం. పొట్టుతియ్యని సంపూర్ణ గోధుమ బ్రెడ్ బటర్ లేకుండా, పండ్లు మా భోజనం. మేము మా భోజనాన్ని ఎంతో ఆనందంగా తిన్నాం. చంచలమయ్యే రుచికి అభిరుచికి తగినట్టు రకరకాల ఆహార పదార్ధములు తీసుకువెళ్లే అవసరం లేనందుకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మేము తృప్తిగా తిన్నాం. మరుసటి ఉదయం వరకు ఆకలి మాదరికి రాలేదు. నారింజ పళ్లు, పప్పులు, పాప్ కార్న్, క్యాండీలు అమ్మే కుర్రాడు మేము ఏమీ కొనకపోటం చూసి పాపం పేదవారు అనుకున్నాడు. CDTel 246.3

ఆ తల్లిదండ్రులు పిల్లలు తిన్న ఆహారం నాణ్యత మంచి రక్తాన్ని లేక మంచి స్వభావాన్ని తయారు చెయ్యలేదు. పిల్లలు మంచి రక్తంలేక పాలిపోయి ఉన్నారు. కొందరికి ముఖాల మీద చేతుల మీద కురుపులున్నాయి. ఇతరులు కండ్ల కలకతో దాదాపు గుడ్డివారయ్యారు. అది వారి ముఖ సౌందర్యాన్ని చాలా మట్టుకి పాడుచేసింది. ఇంకా కొందరికి శరీరంపై పొక్కులు లేవుగాని వారు దగ్గు, పడి సెం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఓ మూడేళ్ల కుర్రాడికి విరేచనాలవు తున్నాయి. అతడికి జ్వరం కూడా ఉంది. కాని తనకు అవసరమయ్యిందల్లా భోజనం అంటున్నాడు. ప్రతీ కొద్ది నిమిషాలకి కేకు, కోడిమాంసం, పచ్చళ్లు కావాలని అడుగుతున్నాడు. తల్లి అతడు అడిగిందల్లా నమ్మకమైన బానిసలా అందించింది. అడిగిన ఆహారం వెంటనే రానప్పుడు, అతడి ఏడ్పు కేకలు ఎక్కువైనప్పుడు తల్లి, “నాన్నా, నీవడిగినవన్ని ఇస్తాను.” అంటూ ఊరడించింది. ఆహారం అతడి చేతులికి అందించిన తర్వాత అది త్వరగా రానందుకు దాన్ని బస్సులో అటూ ఇటూ విరజిమ్మాడు. ఓ చిన్న అమ్మాయి ఉడికించిన హేమ్, కారపు పచ్చడి, బ్రెడ్ బటర్ తింటున్నది. నేను తింటున్న భోజనం ప్లేటుని చూసింది. ఆ ఆరు సంవత్సరాల అమ్మాయి తనకు ఓ ప్లేటు కావాలని మారాం పెట్టింది. ఆ అమ్మాయి కన్ను నా ప్లేటులోని ఎర్రని ఏపిలు పండుమీద ఉందని నాకు తెలుసు. మా వద్ద ఎక్కువ లేకపోయినా ఆ తల్లి పరిస్థితికి జాలిపడి ఆ పిల్లకి చక్కని ఏపిలు పండిచ్చాను. ఆ పిల్ల దాన్ని అందుకుని అసహ్యించుకుంటూ నేలపై పారేసింది. అప్పుడు నేను ఈ అమ్మాయిని తన ఇష్టం ప్రకారం ప్రవర్తించనిస్తే ఆమె తన తల్లికి తలవంపులు తెస్తుందనుకున్నాను. CDTel 247.1

స్వార్థపరురాలు దండ్రులు తమ గొట్టి, నైతిక, మాన్యం నాణ్యత ఎలాంచ్ ఈ రకమైన ఉద్రేక ప్రదర్శన ఆ తల్లి పెట్టే గారాబం పర్యవసానమే. ఆమె తన బిడ్డకిచ్చే ఆహారం నాణ్యత ఆ బిడ్డ జీర్ణమండల అవయవాల పై నిత్యం పెనుభారం మోపుతున్నది. రక్తం చెడురక్తమై బిడ్డ వ్యాధిగ్రస్తమై తరచు కోపపడ్తుంది. ఈ బిడ్డకి అనుదినం ఇచ్చే ఆహారం నాణ్యత ఎలాంటి దంటే అది క్షుద్ర ఉద్రేకాల్ని రెచ్చగొట్టి, నైతిక, మానసిక శక్తుల్ని అణచి వేస్తుంది. ఈ తల్లిదండ్రులు తమ బిడ్డ అలవాట్లను నిర్మిస్తున్నారు. ఆమెని స్వార్థపరురాలుగా ప్రేమ లేనిదానిగా తర్బీతు చేస్తున్నారు. వారు ఆమె కోర్కెల్ని, ఉద్రేకాల్ని నియంత్రించలేదు. ఆమె యుక్తవయసుకి వస్తే ఎలా ప్రవర్తించటానికి ఎదురుచూస్తారు? అనేకులు మనసుకి శరీరానికి మధ్యగల సంబంధాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపించదు. శరీర వ్యవస్థ అనుచిత ఆహారం వల్ల అస్తవ్యస్థమైతే, మెదడు, నరాలు, ప్రభావితమై ఉద్రేకాలు సులువుగా ఉత్తేజితమౌతాయి. CDTel 248.1

ఓ పది సంవత్సరాల బిడ్డ చలిజ్వరంతో బాధపడుతూ తినటానికి ఇష్టపడటం లేదు. ఆమె తల్లి ఇలా బతిమాలింది: “కొంచెం స్పంజ్ కేక్ తినమ్మా... ఇదిగో కొంచెం కోడిమాంసం. వీటిని కాస్త రుచి చూడమ్మా” ఆ అమ్మాయి చివరికి బాగా ఉన్న వ్యక్తి తిన్నంత స్వాభావికంగా తిన్నది. ఆమెకిచ్చిన ఆహారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కడుపుకే అనుచితం. అది ఏ పరిస్థితిలోను జబ్బుగా ఉన్న వ్యక్తికి ఇవ్వకూడని ఆహారం. రెండు గంటల వ్యవధిలో ఆ తల్లి ఆ బిడ్డకు తలంటి స్నానం చెయ్యిస్తూ, ఆ బిడ్డకు అంత ఎక్కువ జ్వరం రావటానికి కారణం లేదని వ్యాఖ్యానించింది. ప్రకృతి తన పని చెయ్యటానికి ఆమె కడుపుకి ఎంతో అవసరమైన విశ్రాంతి తీసుకోటానికి ఆ తల్లి తరుణం ఇచ్చి ఉంటే, ఆ బిడ్డకి అంత బాధ ఉండేది కాదు. ఈ తల్లులు తమ పిల్లల్ని పెంచటానికి సిద్ధపడలేదు. మానవుల మధ్య ప్రబలుతున్న బాధకు కారణం మన సొంత శరీరాల్ని కాపాడుకోటమన్న అంశం పై మనకున్న అజ్ఞానమే. CDTel 248.2

నేను ఏం తినాలి? ప్రస్తుత సమయంలో ఆనందంగా ఉల్లాసంగా ఎలా నివసించాలి? ఇవి అనేకులు ఆలోచించే విషయాలు. ప్రస్తుతానందానికి విధి నిర్వహణను నియమాల్ని పక్కన పెడుతున్నారు. ఆరోగ్యాన్ని కోరుకుంటుంటే మనం దాని కోసం నివసించాలి. క్రైస్తవ ప్రవర్తనను పరిపూర్ణం చేసుకోవాలని ఆశిస్తుంటే మనం దానికోసం నివసించాలి. తమ బిడ్డల శారీరకారోగ్యానికి, నీతి నియమాలకి చాలా మట్టుకు తల్లిదండ్రులే బాధ్యులు. తాము దు:ఖం, బాధ పాలుగాకుండా ఉండేందుకు ఆరోగ్య నియమాల ప్రకారం నివసించాలని తమ పిల్లలకి తల్లిదండ్రులు ఉపదేశించాలి. తమ బిడ్డల శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యం నాశనమయ్యేంతగా వారిని గారాబం చేసి అతిగా తిననివ్వటం ఎంత విచిత్రం! అలాంటి ప్రేమ తీరు ఎలా పరిణమించగలదో! ఈ తల్లులు తమ పిల్లల్ని ఈ జీవితంలోని ఆనందానికి అయోగ్యుల్ని చేసి, వారి బావి నిత్యజీవితావకాశాన్ని అనిశ్చితం చేస్తున్నారు. CDTel 248.3