Go to full page →

సరికాని వంట వల్ల నశించే ఆత్మలు CDTel 264

వంట చేసేవారు ఆరోగ్యవంతమైన ఆహారం ఎలా తయారుచెయ్యాలో నేర్చుకోటం ఓ పవిత్ర విధి. సరికాని వంట కారణంగా అనేక ఆత్మలు నశిస్తున్నాయి. మంచి బ్రెడ్డు తయారుచెయ్యటానికి ఆలోచన శ్రద్ధ అవసరం. ఒక్క బ్రెడ్డు ముక్కలో అనేకులు తలంచే దాని కన్నా ఎక్కువ మతం ఉంది. బాగా వంట చేసేవారు చాలా తక్కువ మంది. వంట చెయ్యటం, తదితర ఇంటి పనులు చెయ్యటం నీచమన్న భావన యౌవన స్త్రీలలో ఉంది. ఈ కారణం వల్ల పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న అనేక మంది యౌవన స్త్రీలు భార్యలుగా తల్లులుగా తాము నిర్వహించాల్సిన బాధ్యతలేమిటో ఎరుగరు. CDTel 264.6